- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్, శంకర్ మధ్య గొడవ.. 'గేమ్ చేంజర్ ' పరిస్థితి ఏంటి?
రామ్ చరణ్ హీరోగా, శంకర్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’.

దిశ, సినిమా : రామ్ చరణ్ హీరోగా, శంకర్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూవీ మొదలై చాలా కాలం అవుతున్నప్పటికీ షూటింగ్ రోజు రోజుకి ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, శంకర్ తో కొంచెం సీరియస్ గా మాట్లాడినట్టు, దానికి శంకర్ కూడా సీరియస్ గానే సమాధానం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి ఎక్కడ కూడా డిలే అవ్వకుండా ఉండడానికి నిర్మాత దిల్ రాజు మొదటి నుండి తన వైపు నుంచి చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. కానీ ఎప్పుడు ఏదో కారణం చేత షూటింగ్ అనేది డిలే అవుతూ వస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో నటిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఈ మూవీ పై ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదట. వాళ్ళ షూటింగ్ కూడా ఒకరోజు చేస్తే పది రోజులు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో కూడా రామ్ చరణ్ కి శంకర్ కి మధ్య మాట మాట వచ్చినట్లు తెలుస్తోంది.






