సూర్య బర్త్ డే కానుకగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్

by Mallepaka Hamsa |

సెకండ్ సింగిల్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా జూలై 23న విడుదల చేసి, ఫ్యాన్స్‌కు గ్రేట్ బర్త్‌డే ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

సూర్య బర్త్ డే కానుకగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. ఇటీవల విడుదలైన ఫస్ట్ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. సూర్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రెండో పాటకు సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో సూర్య స్వయంగా పాడిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సెకండ్ సింగిల్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా జూలై 23న విడుదల చేసి, ఫ్యాన్స్‌కు గ్రేట్ బర్త్‌డే ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ పాటకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా, కెన్ కరుణాస్ లిరిక్స్ రాశారు. హీరో సూర్య తనదైన శైలిలో పాడిన ఈ క్రేజీ సాంగ్ సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలవబోతుందని టాక్. ఇక ఈ సినిమాలో సూర్య సరసన యంగ్ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు

Next Story