ఓ అభిమాని నా గురించి ఓ పుస్తకం రాశాడు.. పదేళ్ల పాటు మాట్లాడలేదు.. ఉపేంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

రామ్‌పోతినేని(Rampothineni), మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.

ఓ అభిమాని నా గురించి ఓ పుస్తకం రాశాడు.. పదేళ్ల పాటు మాట్లాడలేదు.. ఉపేంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: రామ్‌పోతినేని(Rampothineni), మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఇందులో స్టార్ హీరో ఉపేంద్ర ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఆయన ఫ్యాన్‌గా ఈ సినిమయాలో రామ్ పోతినేని కనిపించబోతున్నట్లు టాక్. హీరోయిన్‌గా భాగ్యశ్రీబోర్సే నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రమోషన్స్ జోరు పెంచిన ఉపేంద్ర తన అభిమానుల గురించి చెప్పారు. మీ జీవితంలో ఎదురైన పిచ్చి అభిమాని ఎవరైనా ఉన్నారా? అని యాంకర్ అడగ్గా.. దానికి ఉపేంద్ర సమాధానమిస్తూ.. ‘‘నా జీవితంలో చాలామంది అభిమానులు ఉన్నారు.

అందులో ఒకతను మురళి. నా సినిమాలన్నింటినీ పిచ్చిగా చూశాడు. తన పెళ్లికి కూడా రమ్మని పిలిస్తే.. పాతిక సంవత్సరాల క్రితం వెళ్లాను. నేను అది మాత్రమే ఆయన కోసం చేశాను. కానీ ఆయన నాకోసం ఇప్పటికీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. నా పుట్టినరోజు వస్తే చాలు బ్యానర్లు కట్టి హడావిడి సృష్టిస్తాడు. అంతేకాకుండా వంద కిలోల పువ్వులు తీసుకొచ్చి పూలాభిషేకం చేస్తాడు. నేను ఏమైనా అంటే మీరు ఏమి మాట్లాడకండి.. సైలెంట్ కూర్చొండి ఇది మాకు పండగ అని అంటాడు. అలాగే ఒక అబ్బాయి నా గురించి పుస్తకం రాశాడు. నా ఏ సినిమా చూసి ఒక అబ్బాయి కంప్లీట్ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాడని చెప్పాడు. అంతేకాకుండా పదేళ్లపాటు ఎవ్వరితో మాట్లాడలేదట. ఇలాంటి వారు మంది ఉన్నారు. వారి ప్రేమను నేను ఏమ్ ఇచ్చి రుణం తీర్చుకోను’’ అని అన్నారు.

Next Story