కర్నూల్ అభిమానికి ర‌కుల్‌ ట్వీట్.. ఫిదా అయ్యానంటూ

by Disha Web Desk 10 |
కర్నూల్ అభిమానికి ర‌కుల్‌ ట్వీట్.. ఫిదా అయ్యానంటూ
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ ర‌కుల్‌ ప్రీత్ సింగ్ అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్నా.. మిగతా భాషల్లో వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో స్టోర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నటిని చూసేందుకు క‌ర్నూల్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చాడ‌ట‌ ఓ అభిమాని. దాదాపు ఐదారు గంట‌ల పాటు జ‌ర్నీ చేసి చివ‌ర‌కు త‌న అభిమాన న‌టిని క‌లుసుకున్న యువకుడు.. ర‌కుల్‌తో ఓ ఫొటో దిగాడు. ఆ ఆనందాన్ని ట్విట్టర్ వేదిక‌గా పంచుకుంటూ ‘ర‌కుల్‌ను క‌లిసి మాట్లాడాల‌నే కోరిక నేటితో తీరింది’ అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అత‌డి అభిమానానికి ఫిదా అయిన ర‌కుల్ అత‌డి ట్వీట్‌కు రిప్లై ఇవ్వడం విశేషం.

Read more :

బుచ్చి బాబు,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం ఏమి చేయబోతున్నాడో తెలుసా?



Next Story

Most Viewed