- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో అభిమాని మృతి .. కుటుంబసభ్యులను పరామర్శించిన హీరో సూర్య
by Bhoopathi Nagaiah |
స్టార్ హీరో సూర్యకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు.

X
దిశ, సినిమా: స్టార్ హీరో సూర్యకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటాడు. అయితే తాజాగా ఆయన అభిమాని ఒకరు చెన్నైలోని ఎన్నూర్‌లో నివసించే అరవింద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను హీరో సూర్యకి వీరాభిమాని. అంతే కాదు ఫ్యాన్స్ క్లబ్‌లో కొన్నేళ్లుగా మెంబర్ కూడా. ఇక ఈ విషయం తెలుసుకున్న హీరో వెంటనే అరవింద్ వాళ్ల ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చి, వారిలో ధైర్యం నింపాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఆయనపై ఉన్న అభిమానం మరింత పెరిగిందని అంటున్నారు ఫ్యాన్స్.
Next Story






