‘హనుమాన్’ మూవీ చూస్తూ బోరున ఏడ్చేసిన చిన్నారి.. వీడియోపై స్పందించిన ప్రశాంత్ వర్మ

by Disha Web Desk 9 |
‘హనుమాన్’ మూవీ చూస్తూ బోరున ఏడ్చేసిన చిన్నారి.. వీడియోపై స్పందించిన ప్రశాంత్ వర్మ
X

దిశ, సినిమా: యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘హనుమాన్’. టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీసును ఓ రేంజ్ లో షేక్ చేసింది. సంక్రాంతికి అగ్ర హీరోల సినిమాలు విడుదలైనప్పటికీ హనుమాన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా 300 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం నిన్నటి నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంది. థియేటర్లలో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ రికార్డులు కొల్లగొడుతోంది.

నేషనల్ వైడ్ గా టాప్ ట్రెండింగ్ లో ఉంటూ భారీ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. అయితే తాజాగా ఓటీటీలో ఈ మూవీ చూసిన చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంటర్వెల్ సమయంలో వచ్చే కుస్తీ ఫైట్ సీన్ లో విలన్ తేజా ను కొట్టి కింద పడేస్తాడు. ఆ సన్నివేశం చూసిన ఓ పాప బోరున ఏడ్చేసింది. హీరో లేచి మళ్లీ తిరిగి కొట్టాక చప్పట్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించడం విశేషం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed