సాయి పల్లవికి బంపర్ ఆఫర్.. బాలీవుడ్ స్టార్ హీరోతో నటించే చాన్స్ కొట్టేసిన నేచురల్ బ్యూటీ!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-01 10:58:32  IST  )

ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరో స్వయంగా పిలిచి అవకాశం ఇచ్చారంటే, ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాయి పల్లవికి బంపర్ ఆఫర్.. బాలీవుడ్ స్టార్ హీరోతో నటించే చాన్స్ కొట్టేసిన నేచురల్ బ్యూటీ!
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తన నటనతో అన్ని ఇండస్ట్రీల హీరోలను, దర్శకనిర్మాతలను మంత్రముగ్దులను చేస్తోంది. దీంతో అమ్మడుకి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. తన సహజమైన అందంతో అందరినీ కట్టిపడేసే ఈ భామ, ఇప్పుడు హిందీ చిత్రసీమలో వరుస అవకాశాలను అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి పల్లవి ‘ఏక్ దిన్’ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ఆమె నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సాయి పల్లవి నటనను చూసి ఆమిర్ ఖాన్ షాక్ అయ్యారట. ఆమె పర్ఫార్మెన్స్ ఎంత బాగుందంటే, ఏకంగా తన తదుపరి మూవీలో ఒక పవర్ ఫుల్ పాత్రను ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరో స్వయంగా పిలిచి అవకాశం ఇచ్చారంటే, ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆమిర్ ఖాన్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇప్పటికే సాయి పల్లవి బాలీవుడ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రామాయణం’లో సీత పాత్రను పోషిస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సాయి పల్లవికి ఏ భాషలోనైనా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే దక్కుతున్నాయి. ఆమిర్ ఖాన్ సినిమాలో ఆమె చేసే ఆ శక్తివంతమైన పాత్ర బాలీవుడ్‌లో ఆమె స్థానాన్ని మరింత పదిలం చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేసే సాయి పల్లవి, హిందీలో కూడా సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.

‘తుంబాడ్-2’లో ఆలియా భట్ కీ రోల్!

Next Story