బాలీవుడ్ బాక్సాఫీసుపై రాశీఖన్నా దండయాత్ర.. స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర!

by Mallepaka Hamsa |

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాశీ ఖన్నా ఒక కీలకమైన, గ్లామరస్ పాత్రలో మెరవబోతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

బాలీవుడ్ బాక్సాఫీసుపై రాశీఖన్నా దండయాత్ర.. స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర!
X

దిశ, సినిమా: టాలీవుడ్ అందాల భామ రాశీ ఖన్నా ఇప్పుడు బాలీవుడ్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే తన గ్లామర్, నటనతో హిందీ ప్రేక్షకులను మాయ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన నటించే బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది. కామెడీ చిత్రాల కింగ్ అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ‘రామ్ ఔర్ శ్యామ్’ (Ram Aur Shyam) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాశీ ఖన్నా ఒక కీలకమైన, గ్లామరస్ పాత్రలో మెరవబోతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో అక్షయ్ కుమార్‌తో వెల్కమ్, సింగ్ ఈజ్ కింగ్ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన అనీస్ బాజ్మీ, దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్లీ అక్షయ్‌తో జతకడుతున్నారు. ఈ సినిమాలో అక్షయ్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, రాశీ ఖన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవబోతోందని టాక్. జనవరి 20న ముంబైలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం కర్జాత్‌కు షిఫ్ట్ కానుందట.

ఈ నెల చివరలో ప్రారంభం కాబోయే ఈ షెడ్యూల్‌లో రాశీ ఖన్నా కూడా జాయిన్ కాబోతోందని తెలుస్తోంది. దర్శకుడు అనీస్ బాజ్మీ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇందులో కేవలం కామెడీ మాత్రమే కాకుండా, రాశీ ఖన్నా గ్లామర్, అక్షయ్ మార్క్ యాక్షన్, అదిరిపోయే సాంగ్స్ ఇలా పక్కా మాస్ మసాలా ఎలిమెంట్స్ ఉంటాయని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథాంశంతో ఈ చిత్రానికి పోలికలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నా, నిర్మాత దిల్ రాజు కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ఏప్రిల్ మధ్యలో విడుదల కానుండగా, ఇప్పుడు ‘రామ్ ఔర్ శ్యామ్’ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. మొత్తానికి రాశీ ఖన్నా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి రెడీ అయిపోయింది.

Next Story