‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో యంగ్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. ఆ హీరోకు జోడీగా చాన్స్!

by Mallepaka Hamsa |

‘హరిహర వీరమల్లు’ చిత్రంలో తన నటనతో మెప్పించిన తెలుగు అందం పూజిత పొన్నాడ, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తోందట.

‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో యంగ్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. ఆ హీరోకు జోడీగా చాన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ తనదైన శైలిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకీ మామ, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘ఆదర్శ కుటుంబం’పై దృష్టి పెట్టారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మూవీకి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చిత్ర యూనిట్ ఎక్కడా హడావుడి చేయకుండా చాలా సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేస్తోందట. ఇందులో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా హాసిని క్రియేషన్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఎన్నో విశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో తన నటనతో మెప్పించిన తెలుగు అందం పూజిత పొన్నాడ, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తోందట. కేవలం సపోర్టింగ్ రోల్ మాత్రమే కాకుండా, ఇందులో మరో ఇంట్రెస్టింగ్ యాక్టర్ నారా రోహిత్‌కు జోడీగా పూజిత కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమాల్లో ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది, కాబట్టి పూజిత కెరీర్‌కు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ డ్రామాకు త్రివిక్రమ్ డైలాగులు తోడైతే థియేటర్లలో నవ్వుల వర్షం కురవడం ఖాయం. ఒకవైపు వెంకీ-శ్రీనిధి జంట, మరోవైపు నారా రోహిత్-పూజిత జోడీ ఉండటంతో ‘ఆదర్శ కుటుంబం’ వెండితెరపై ఒక నిండుదనంతో కూడిన సినిమాగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Next Story