- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. యాక్షన్ సిక్వెన్స్‌తో బాక్సాఫీసు షేక్ అవడం ఖాయం!
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ‘రాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉన్న స్టార్ కాస్టింగ్ చూస్తుంటే, అట్లీ ఒక అంతర్జాతీయ స్థాయి యాక్షన్ డ్రామాను ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఆమెతో పాటు యంగ్ సెన్సేషన్స్ జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో హల్ చల్ చేస్తున్నాయి. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో, ఒక పవర్‌ఫుల్ డాన్ చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని టాక్. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో, రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట. రాబోయే షెడ్యూల్‌లో అల్లు అర్జున్, అక్షయ్ కుమార్ మధ్య కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వారంతా బాక్సాఫీసు షేక్ అవడం ఖాయమని కామెంట్లు పెడుతున్నారు. ఇక అక్షయ్ కుమార్ లాంటి యాక్షన్ స్టార్ తోడవ్వడం సినిమాకు పాన్ ఇండియా లెవల్‌లో భారీ ప్లస్ కానుంది. ఈ యాక్షన్ సీన్లు సినిమాలోనే హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఒకింత అయోమయానికి గురిచేసినా, సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మాత్రం అమాంతం పెంచేసింది. అట్లీ తన సినిమాల్లో హీరోలను ఎంతో స్టైలిష్‌గా, మాస్‌గా చూపిస్తారు. మరి అల్లు అర్జున్ ను ‘రాకా’లో ఏ రేంజ్ లో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.






