- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమన్నాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్.. అసలు విషయాలు బయటపెడుతూ విజయ్ గంగూలీ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia) గత కొద్ది కాలంగా బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటిస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia) గత కొద్ది కాలంగా బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటిస్తోంది. ఓ వైపు సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తూనే ఐటమ్ గర్ల్‌గా కూడా మారిపోయింది. పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు కుర్రకారుకు చెమటలు పట్టేలా చేస్తోంది. అలాంటి తమన్నాను ఓ దర్శకుడు రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ధురంధర్’ (Dhurandhar)సినిమాలో అత్యంత ప్రేక్షాదరణ పొందిన ‘శరరత్’ సాంగ్‌లో ముందుగా తమన్నాను తీసుకోవాలని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ (Vijay Ganguly)నిర్ణయించుకున్నారట. ఈ విషయం దర్శకుడు ఆదిత్య ధర్‌కు చెప్పగా.. అందుకు ఆయన ససెమిరా వద్దు అన్నట్లు సమాచారం. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ గుంగూలీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘శరరత్ పాట కోసం నేను తమన్నాను తీసుకుందాం అని చెప్పాను.
కానీ ఆదిత్య ధర్ అందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ తమన్నా ఈ పాటో కనిపిస్తే.. ప్రేక్షకులు దీనిని కేవలం ఒక స్పెషల్ సాంగ్‌లానే చూస్తారు తప్ప కథలో భాగంగా చూడరు.ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే అందరి దృష్టి తమన్నా డ్యాన్స్‌పైనే ఉంటుంది. దీంతో ఆడియన్స్ కథ నుంచి డిస్ కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని అన్నారు’’ అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ పాటను కథాంశలో భాగంగానే ఉంచాలని ఆధిత్య ధర్ స్టార్ హీరోయిన్‌ను కాకుండా.. అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజాలను ఎంపి చేసినట్లు తెలుస్తోంది. కాగా.. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కలెక్షన్లు భారీగా రాబడుతుండటంతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందుతోంది.






