విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయబోతున్న బాలీవుడ్ బ్యూటీ!

by Mallepaka Hamsa |

విజయ్ - కృతి సనన్ జోడీ వెండితెరపై ఒక సరికొత్త కలర్ ఫుల్ వైబ్‌ను తీసుకురావడం ఖాయం.

విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయబోతున్న బాలీవుడ్ బ్యూటీ!
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే రౌడీ జనార్ధన్, రణబలి వంటి చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్, ఇటీవల ‘హాయ్ నాన్న’ ఫేమ్ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో విజయ్ దేవరకొండకు జోడీగా ఎవరు నటిస్తారనే విషయంలో గత కొద్ది రోజులుగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర యూనిట్ కృతిని సంప్రదించగా, కథ నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, విజయ్ - కృతి సనన్ జోడీ వెండితెరపై ఒక సరికొత్త కలర్ ఫుల్ వైబ్‌ను తీసుకురావడం ఖాయం.

దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రాన్ని ఏ విషయంలోనూ తగ్గకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు ఎరిక్ డర్ట్స్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అలెజాండ్రో మార్టినెజ్ వంటి హేమాహేమీలు పనిచేస్తున్నారు. ‘హృదయం’, ‘ఖుషి’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్, కృతి సనన్ జోడీపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ జంట చాలా ఫ్రెష్‌గా ఉంటుందని, వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోతుందని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం విజయ్ పక్కన కృతి సెట్ అవుతుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, ఈ క్రేజీ కాంబినేషన్‌పై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వస్తే తప్ప అసలు విషయం తెలియదు. పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ విజయ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Next Story