- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ్డీ కాంతమ్మతో మామూలుగా ఉండదు.. ‘హైలెస్సో’ సినిమాలో బోల్డ్ బ్యూటీ ఫిక్స్
యంగ్ బ్యూటీ అక్షరా గౌడ (Akshara Gowda)ముందుగా కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అక్షరా గౌడ (Akshara Gowda)ముందుగా కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించిన ఈ భామ తన నటన అందంతో మెప్పించి. ఇక తెలుగులో ది వారియర్, ధమ్కీ, నేనేనా, హరోంహర వంటి చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. కానీ అనుకున్నంత పాపులారిటీ దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ అక్షర గౌడకు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా, బోల్డ్ బ్యూటీ అక్షరా మరోసారి తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో మేకర్స్.. ఈ అమ్మడుకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘హైలెస్సో’ (Hylesso)టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ‘వడ్డీ కాంతమ్మ’ పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఈ పోస్ట్‌కు ‘‘మా వడ్డీ కాంతమ్మతో మామూలుగా ఉండదు. పురుషులు పరిపాలించే ప్రపంచంలో.. ఆమె ఆటను శాసిస్తుంది. త్వరలోనే వెండితెరపై ఆమెను కలవడానికి సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు.
ఫస్ట్ లుక్‌లో చీర కట్టుకుని ఓ చేతిలో డబ్బులు పట్టుకున్న అక్షరా గౌడ... ఆమె వెనుక మార్కెట్ తరహా విజువల్ చూస్తుంటే, పల్లెటూరిలో సంత జరిగే ప్రాంతంలో చిన్న మధ్య తరగతి వ్యాపారులకు వడ్డీకి డబ్బులు అప్పుగా ఇచ్చే కాంతమ్మ రోల్ చేస్తున్నట్టు అర్థం అవుతోంది. కాగా.. ఈ సినిమాలో సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) హీరోగా నటిస్తుండగా.. ఇందులో అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం తెరకెక్కుతుండగా.. వజ్ర వారాహి సినిమాస్ పతాకంపై శివ చెర్రీ, రవి కిరణ్ నిర్మిస్తున్నారు. నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.






