బాక్సాఫీసు వద్ద రక్తపాతమే.. హాట్ టాపిక్‌గా మారిన విజయ్, రష్మిక వయలెంట్ లుక్స్‌

by Mallepaka Hamsa |

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)సైలెంట్‌గా నిర్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

బాక్సాఫీసు వద్ద రక్తపాతమే.. హాట్ టాపిక్‌గా మారిన విజయ్, రష్మిక వయలెంట్ లుక్స్‌
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)సైలెంట్‌గా నిర్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి చిత్రాల్లో జంటగా నటించిన వీరిద్దరు గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ జంట వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నరంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక కెరీర్ పరంగా చూసుకుంటూ.. వీరిద్దరు ప్రేమ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కానీ వీరిద్దరి లేటెస్ట్ సినిమాలకు సంబంధించిన పోస్టర్లు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘రౌడీ జనార్ధన్’ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌లో విజయ్ ఫుల్ రగ్డ్ లుక్‌లో, ఒళ్లంతా రక్తంతో పెద్ద కత్తితో భయంకరంగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఇక రష్మిక విషయానికొస్తే.. ఆమె పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న ‘మైసా’ గ్లింప్స్‌లో రష్మిక కనిపించిన లుక్ గూస్ బంప్స్ వచ్చేలా చేస్తోంది. గన్ పట్టుకుని యాక్షన్ మోడ్‌తో కనిపించింది. ఇక కాబోయే భార్యభర్తలైన ఈ జోడీ వయలెంట్ లుక్స్‌లో కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక రష్మిక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఇలా మారిపోయారేంట్రా బాబు. ఎలా ఉండేవారు.. ఇలా అయ్యారేంటి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఒకప్పుడు సాఫ్ట్‌గా కనిపించిన వీరిద్దరు ఇప్పుడు ఊరమాస్ లుక్స్‌లో కనిపించడంతో ఈసారి బాక్సాఫీసు వద్ద రక్తపాతమే.. రికార్డులు వేరే లెవల్‌లో ఉండబోతున్నాయని అంతా అభిప్రాయపడుతున్నారు.

Next Story