- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సిగ్మా’ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. షాకింగ్ వీడియో విడుదల చేసిన మేకర్స్
ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. హీరోల వారసులు సినీ పరిశ్రమలో కొనసాగుతూ.. తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అయితే కొందరు హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారుతుంటే.. మరికొందరు మాత్రం ఊహించని విధంగా దర్శకత్వం ఫీల్డ్‌ను ఎంచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదే లిస్ట్‌లోకి తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ (Jason Sanjay)చేరాడు. త్వరలో దర్శకుడిగా ఇడస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఆయన తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సిగ్మా’(Sigma). ఇందులో సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా నటిస్తుండగా.. అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్మాత సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఈ పోస్టర్ తప్ప నటీనటులకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు.
ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ కాగా.. అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ‘సిగ్మా’ మూవీ మేకర్స్ డబుల్ అప్డేట్ ఇస్తూ షాకింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్లు తెలుపుతూ.. డిసెంబర్ 23న సాయంత్రం 5గంటలకు టీజర్ రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా షూట్ వీడియోను షేర్ చేశారు. ఇక ఇందులో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్, సంపత్ రాజ్, రాజు సుందరం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లలో ‘సిగ్మా’ మూవీపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. మరికొందరు షాక్ అవుతున్నారు.






