‘గాయపడ్డ సింహం’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. అమెరికా వెళ్లాలనుకునే యువకుడి కథతో నవ్వుల విందు!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-09 14:55:40  IST  )

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) కేవలం మెగాఫోన్ పట్టి సినిమాలను తెరకెక్కించడమే కాదు, నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

‘గాయపడ్డ సింహం’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. అమెరికా వెళ్లాలనుకునే యువకుడి కథతో నవ్వుల విందు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) కేవలం మెగాఫోన్ పట్టి సినిమాలను తెరకెక్కించడమే కాదు, నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇటీవలే ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమాతో హీరోగా పలకరించిన తరుణ్, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా నిరాశ చెందకుండా వరుస చిత్రాలు ప్రకటిస్తున్నాడు. తాజాగా.. ‘గాయపడ్డ సింహం’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమాను కామెడీ ఎంటర్‌టైనర్‌గా కశ్యప్ శ్రీనివాస్(Kashyap Srinivas) తెరకెక్కిస్తున్నారు. ఇందులో తరుణ్ భాస్కర్ సరసన చిట్టి ఫేమ్ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) హీరోయిన్‌గా నటిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, ఇది ఎలాగైనా అమెరికా వెళ్లాలనే పట్టుదలతో ఉండే ఒక యువకుడి కథగా అనిపిస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో తరుణ్ తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో ‘‘పెళ్లి చూపులు’’ సినిమాపై తరుణ్ వేసిన పంచ్ హైలైట్‌గా నిలిచాయి. పెళ్లి చూపుల గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగితే.. ‘‘యావరేజ్ సినిమా’’ అని తరుణ్ చెప్పే డైలాగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన సొంత సినిమాపైనే సెటైర్ వేసుకోవడంతో ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగింది. ట్రైజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. కొంతమందికి అమెరికా వెళ్లాలని లక్ష్యం ఉంటుంది. నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది వున్నారు. కానీ వీసాలు చాలాసార్లు రిజెక్ట్ అవుతుంటాయి. దానికి చాలా నవ్వుకునే కారణాలు ఉంటాయి.

నిజంగా అదొక ప్రపంచం. ఇలాంటి కథతో కశ్యప్ వచ్చినప్పుడు ఆ కథ చెప్పినప్పుడే విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఆ యూనిక్ ట్రీట్మెంట్ కి ఫిదా అయిపోయాను. ఆడియన్స్ కూడా ఫిదా అవుతారని నమ్మకం ఉంది.కశ్యప్ చాలా యూనిక్ వాయిస్ ఉన్న డైరెక్టర్. తన సెన్సాఫ్ హ్యూమర్ చాలా యూనిట్ గా ఉంటుంది. తనకి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది. స్క్రీన్ లో చూసినప్పుడు నవ్వుతూనే ఉంటారు. మా ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. పవన్ తను ఏదైనా అనుకుంటే కచ్చితంగా సాధిస్తాడు.తను సినిమాని ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాచేయడం ఒక మంచి అవకాశం గా భావిస్తున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ధియేటర్లో లాఫ్ రైడ్ ఉంటుంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఫారియాతో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఒక డాన్స్ నెంబర్ ఉంది. అందులో నాకు చాలా హెల్ప్ చేసింది. చాలా మంచి సినిమా. ఎవరు మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ.. సినిమాని ఒక ఆడియన్ గా విన్నాను. చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా అద్భుతమైన కథ ఇది. డైరెక్టర్ చాలా చక్కగా తీశారు. నిర్మాతలకు, ప్రజెంటర్ పవన్ కి థాంక్యు. ఈ ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేశాను. తరుణ్ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీరందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పింది. డైరెక్టర్ కశ్యప్ మాట్లాడుతూ.. ఫస్ట్ సినిమా తీయడం, ఇక్కడి వరకు రావడం ఒక సక్సెస్. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డైరెక్టర్ పవన్ సాదినేని గారు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. ఈ కథ రెడీ చేసిన తర్వాత నా మైండ్ లోకి తరుణ్ భాస్కర్ గారు వచ్చారు. ఆయన ముందు చేయనన్నారు. కథ విని తర్వాత నిర్ణయం తీసుకోమన్నారు. కథ విన్న తర్వాత ఆయనకి చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’’ అని అన్నారు.



Next Story