రాజమౌళికి బిగ్ షాక్.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘వారణాసి’ వీడియోలు

by Mallepaka Hamsa |

రాజమౌళి తన సినిమా సెట్స్‌లో ఈగ కూడా దూరనివ్వకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ, ఎవరో ఒకరు సీక్రెట్‌గా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.

రాజమౌళికి బిగ్ షాక్.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘వారణాసి’ వీడియోలు
X

దిశ, సినిమా: రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమా చుట్టూ ఇప్పుడు లీకుల సెగలు ముసురుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీకి సంబంధించి తాజాగా ఒక యాక్షన్ క్లిప్ బయటకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రాజమౌళి తన సినిమా సెట్స్‌లో ఈగ కూడా దూరనివ్వకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ, ఎవరో ఒకరు సీక్రెట్‌గా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. గతంలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే కీలక సన్నివేశాలు లీక్ అవ్వగా.. ఇప్పుడు ఏకంగా ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ విజువల్స్ నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇది చూసిన చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

నిజానికి లీకులు రాజమౌళికి కొత్తేమీ కాదు. 'బాహుబలి' కాలం నుంచి ఆయన సినిమాలకు ఇలాంటి తలనొప్పులు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే, లీకులు ఎన్ని వచ్చినా అవి బాక్సాఫీస్ వద్ద తన మూవీస్ ప్రభావాన్ని ఏమాత్రం తగ్గించలేవని ఆయన నమ్ముతారు. అందుకే ఇప్పుడు ‘వారణాసి’ విషయంలో కూడా రాజమౌళి తన దృష్టిని కేవలం క్వాలిటీపైనే పెట్టారట. ఎంతమంది ఎన్ని లీకులు చేసినా, సినిమా అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబును ఒక గ్లోబల్ లెవల్ హీరోగా, ప్రియాంక చోప్రాతో కలిసి రాజమౌళి ఎలా చూపించబోతున్నారో అన్నది ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్. ఈ భారీ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. లీకులు సినిమా హైప్‌ను పెంచుతున్నాయో లేక ఇబ్బంది పెడుతున్నాయో పక్కన పెడితే.. రాజమౌళి మార్క్ వెండితెర అద్భుతాన్ని చూడటానికి మాత్రం ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు.

Next Story