విజయ్‌ దేవరకొండతో రష్మిక పెళ్లి.. దుమారం రేపుతున్న ఫొటోలు

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-16 06:27:12  IST  )

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గీత గోవిందం’. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ వచ్చి ఏడేళ్లు పూర్తి కావడంతో

విజయ్‌ దేవరకొండతో రష్మిక పెళ్లి.. దుమారం రేపుతున్న ఫొటోలు
X

దిశ, వెబ్ డెస్క్ : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గీత గోవిందం’. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ వచ్చి ఏడేళ్లు పూర్తి కావడంతో స్పెషల్ పిక్స్ షేర్ చేసింది రష్మిక. విజయ్‌తో రొమాంటిక్ సీన్ నుంచి పెళ్లిపీటల మీద కూర్చోవడం వరకు ఇలా అన్నీ ఇందులో ఉన్నాయి. అసలు ఈ ఫొటోలు తన దగ్గర ఇంకా ఉన్నాయంటే నమ్మలేకపోతున్నానని అంటూ ఈ సినిమా చాలా స్పెషల్ అంటూ మురిసిపోయింది.

ఈ క్రమంలో రష్మిక షేర్ చేయలేని పిక్స్ కూడా షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అభిమానులు విజయ్, రష్మిక ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో ఉన్న వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు. ఆ విధంగా వారిని వధూవరులుగా చూసి సంబరపడుతున్నారు.

Next Story