పవన్ కల్యాణ్ సినిమాపై హైప్ పెంచిన ‘7G బృందావన్ కాలనీ’ హీరో! (వీడియో)

by Disha Web Desk 2 |
పవన్ కల్యాణ్ సినిమాపై హైప్ పెంచిన ‘7G బృందావన్ కాలనీ’ హీరో! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. దీనిని ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌కు వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌గా తెరకెక్కుతుండటంతో పాటు మొదటిసారి పాన్‌ ఇండియా లెవెల్‌లో వస్తోన్న పీరియాడికల్ మూవీ కావడంతో భారీగా ప్లాన్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంపై 7G బృందావన్ కాలనీ సినిమా హీరో రవికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘7G బృందావన్ కాలనీ’ రీ రిలీజ్ సందర్భంగా రవికృష్ణ పలు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘అది భారీ చిత్రం. అద్భుతంగా వస్తోంది. ఫ్యాన్స్‌ ఆకలి తీరుస్తుంది. ఆ స్క్రిప్ట్ నాకు తెలుసు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. రవికృష్ణ ఇంటర్వ్యూను ఫాలో అయిన ఫ్యాన్స్‌ సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. కాగా, రవికృష్ణ ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏఎమ్ రత్నం కొడుకు కావడం గమనార్హం.


Next Story