- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘7G బృందావన్ కాలనీ-2’ టీజర్ అప్డేట్.. ఫుల్ ఖుషీలో సినీ ప్రియులు
సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న లవ్ స్టోరీస్‌లో ‘7G బృందావన్ కాలనీ’ (7G Brindavan Colony)కూడా ఒకటి.

దిశ, సినిమా: సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న లవ్ స్టోరీస్‌లో ‘7G బృందావన్ కాలనీ’ (7G Brindavan Colony)కూడా ఒకటి. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్(Sonia Agarwal) జంటగా నటించారు. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా సినీ ప్రియుల మనసులు గెలుచుకుంది. ఈ కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘7G బృందావన్ కాలనీ-2’ టైటిల్‌తో రాబోతున్నట్లు ఇటీవల మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఎ.ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇక ఇందులో రవి కృష్ణ తన అద్భుతమైన నటనతో మరోసారి తనదైన శైలిలో మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన సరసన యంగ్ బ్యూటీ అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జయరామ్, సుమన్ శెట్టి, సుధ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్‌కు సంబంధించిన షూటింగ్ కూడా తుది దశకు కూడా చేరుకున్నట్లు టాక్. అయినప్పటికీ ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో సినీ ప్రియులంతా ‘7G బృందావన్ కాలనీ-2’ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘7G బృందావన్ కాలనీ-2’ టీజర్ ఆగస్టులో విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ టీజర్‌పై థియేటర్స్‌లో ‘హరిహరవీరమల్లు’తో పాటు ప్రదర్శించాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేయగా.. ఆర్థిక సమస్యల కారణంగా రిలీజ్ చేయలేకపోయారు. ఇక ఇప్పుడు ఈ టీజర్‌ను ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత ఉందనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు మాత్రం ఆనందపడుతున్నారు.






