Filmfare Awards 2026: 70వ ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్.. చిన్న సినిమాలు vs భారీ ప్రాజెక్టులు

by Mallepaka Hamsa |

ఏడాది పొడవునా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్(70th Filmfare Awards) 2026 సందడి మొదలైంది.

Filmfare Awards 2026: 70వ ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్.. చిన్న సినిమాలు vs భారీ ప్రాజెక్టులు
X

దిశ, సినిమా: సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లాక్ లేడీ అవార్డ్స్ కోసం సమయం ఆసన్నమైంది. సినీ తారలు, అభిమానులు ఏడాది పొడవునా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్(70th Filmfare Awards) 2026 సందడి మొదలైంది. ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి, నామినేషన్లను అధికారికంగా ప్రకటించారు. 2024లో విడుదలైన చిత్రాల నుంచి ఉత్తమ ప్రతిభను గుర్తించి ఈ అవార్డులను అందించబోతున్నారు.

ఇక ఈ ఏడాది టాలీవుడ్ నామినేషన్లు చూస్తుంటే.. బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తుడిచేసిన భారీ చిత్రాలతో పాటు, కంటెంట్ నమ్ముకుని వచ్చిన చిన్న సినిమాలు కూడా పోటీ పడుతుండటం విశేషం. ఈసారి 'బెస్ట్ ఫిల్మ్' కేటగిరీలో తీవ్రమైన పోటీ నెలకొంది. విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ'(Kalki 2898 AD), మాస్ జాతర 'పుష్ప: ది రూల్'(Pushpa: The Rule), దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'హనుమాన్' రేసులో ముందున్నాయి. వీటితో పాటు విభిన్నమైన కథలతో మెప్పించిన 'లక్కీ భాస్కర్', చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన '35 చిన్న కథ కాదు', యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'కమిటీ కుర్రోళ్లు' కూడా నామినేషన్స్ దక్కించుకుని ఆశ్చర్యపరిచాయి.

బెస్ట్ దర్శకుడు:

నాగ్ ఆశ్విన్ (కల్కి 2898ఏడీ)

ప్రశాంత్ వర్మ (హనుమాన్)

సుకుమార్ (పుష్ప: ది రూల్)

యధు వంశీ( కమిటీ కుర్రోళ్లు

వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

నంద కిశోర్(35 చిన్న కథ కాదు)

బెస్ట్ హీరోయిన్:

ఆషికా రంగనాథ్(నా సామి రంగ)

మీనాక్షి చౌదరి(లక్కీ భాస్కర్)

నివేథా థామస్(35 చిన్న కథ కాదు)

ప్రియాంక మోహన్(సరిపోతా శనివారం)

రష్మిక మందన్న(పుష్ప: ది రూల్)

అనుపమ పరమేశ్వరన్(టిల్లు స్క్వేర్)

బెస్ట్ హీరో:

దుల్కర్ సల్మాన్(లక్కీ భాస్కర్)

తేజా సజ్జా(హనుమాన్)

అల్లు అర్జున్(పుష్ప: ది రూల్)

నాని(సరిపోదా శనివారం)

జూనియర్ ఎన్టీఆర్(దేవర)

సిద్దు జొన్నలగడ్డ(టిల్లు స్క్వేర్)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్

దేవీశ్రీ ప్రసాద్(పుష్ప-2)

తమన్(గుంటూరు కారం)

జీవీ ప్రకాష్ కుమార్(లక్కీ భాస్కర్)

చైతన్ భరద్వాజ్(హరోంహర)

జెక్స్ బెజోయ్(సరిపోదా శనివారం)

గౌర హరి,అనుదీప్,కృష్ణ సౌరభ్(హనుమాన్)

అనిరుధ్ రవిచందర్(దేవర)

సహాయక పాత్రల్లో మెప్పించిన నటీమణులు

శ్రద్ధాశ్రీనాథ్(మెకానిక్ రాకీ)

రషి సింగ్ నందు(ప్రసన్న వదనం)

ఫరియా అబ్దుల్లా(మత్తు వదలరా-2)

శరణ్య ప్రదీప్( అంబాజీపేట మ్యారేజీ బ్యాండు)

అంజలి(గ్యాంగ్ ఆఫ్ గోదావరి)

వరలక్ష్మి శరత్ కుమార్(హనుమాన్)

సహాయక పాత్రల్లో మెప్పించిన నటులు

అమితాబ్ బచ్చన్(కల్కి2898ఏడీ)

ఫహాద్ ఫాజిల్(పుష్ప: ది రూల్)

ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)

ధనంజయ్(జీబ్రా)

వినయ్ రాయ్(హనుమాన్)

Next Story