Anushka Shetty: అనుష్క శెట్టి పోస్టర్ వల్ల 40 యాక్సిడెంట్లు.. షాక్‌లో నెటిజన్లు.. అంతలా అందులో ఏముందో తెలుసా?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) అందరికీ సుపరిచితమే.

Anushka Shetty: అనుష్క శెట్టి పోస్టర్ వల్ల 40 యాక్సిడెంట్లు.. షాక్‌లో నెటిజన్లు.. అంతలా అందులో ఏముందో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) అందరికీ సుపరిచితమే. ‘సూపర్’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చి మొదటి ప్రాజెక్ట్‌తోనే ఘన విజయం అందుకుంది. దీంతో అమ్మడు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అలా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ‘సైజ్ జీరో’ మూవీతో బరువు పెరగడంతో సినిమాలు తగ్గించింది. చివరగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty)చిత్రంలో నటించింది. ప్రస్తుతం ‘ఘాటి’ (Ghati)తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. అనుష్క వేశ్యగా నటించిన ‘వేదం’ విడుదలై పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ మూవీ వచ్చిన సమయంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వేదం’ ప్రమోషన్ కోసం అనుష్క పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ వాడారు. అయితే పలు చోట్ల హోర్డింగ్ పెట్టారు. అయితే పంజాగుట్ట సర్కిల్‌లో కూడా అనుష్క పోస్టర్లు పెట్టడంతో ఆమెను చూస్తూ ఉండిపోయిన వాహనదారులు యాక్సిడెంట్లు బారిన పడడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఒక్కటి కాదు రెండు దాదాపు 40 యాక్సిడెంట్స్ కావడంతో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్‌ను తొలగించారట. ఇక ఈ వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Next Story