Rishabh Shetty: 24 ఏళ్ల కల నెరవేరింది.. నా దేవుడు నన్ను కలిశాడు.. కాంతార హీరో ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ హీరో రిషబ్ శెట్టి కాంతార సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు.

Rishabh Shetty: 24 ఏళ్ల కల నెరవేరింది.. నా దేవుడు నన్ను కలిశాడు.. కాంతార హీరో ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో రిషబ్ శెట్టి కాంతార సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రజెంట్ కాంతార సీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్-1’ షూటింగ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతున్నాడు. తాజాగా, రిషబ్ శెట్టి సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తన దేవుడిని కలవడంతో సంతోషాన్ని పట్టలేక తన కల నెరవేరిందని చెప్పాడు. ‘‘నటుడిగా మారే నా ప్రయాణంలో, విక్రమ్ సర్ ఎప్పుడూ నాకు స్ఫూర్తి.

24 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఈ రోజు నా దేవుడు కలుసుకోవడం నన్ను భూమిపై అత్యంత అదృష్ట వ్యక్తిగా భావిస్తున్నాను. నాలాంటి నటీనటులను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు. తంగలాన్ కోసం మీకు శుభాకాంక్షలు. నిన్ను ప్రేమిస్తున్నాను, చియాన్’’ అని రాసుకొచ్చాడు. అలాగే చియాన్ విక్రమ్‌తో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. కాగా.. ప్రజెంట్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే విక్రమ్‌, రిషబ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలపడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

(Video Link Credits to rishabshetty Instagram Channel)

Next Story