"18 Pages" Movie Twitter Review

by Phanindra |   (  Updated:2023-01-23 06:05:17  IST  )

కార్తీకేయ 2 సినిమా తర్వాత హీరో నిఖిల్ నటించిన సినిమా " 18 పేజెస్ ".

18 Pages Movie Twitter Review
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీకేయ 2 సినిమా తర్వాత హీరో నిఖిల్ నటించిన సినిమా " 18 పేజెస్ ". ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాకు " జీఏ 2 పిక్చర్స్ " , " సుకుమార్ రైటింగ్స్ " సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఈ సినిమాకు బన్నీ వాస్ , అల్లు అరవింద్ సమర్పకులుగా ఉన్నారు. 'కార్తికేయ2' వంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా తర్వాత ఇద్దరు జంటగా కలిసి రెండో సారి ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు. 'కుమారి 21ఎఫ్' వంటి సినిమా తరవాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నుంచి విడదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను , అభిమానులను ఎంత గానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా గురించి వారి అభిప్రాయాలను ట్విట్టర్ వేదిక ద్వారా షేర్ చేసుకున్నారు. వారి చెప్పిన దాని బట్టి ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా .. సెకండ్ హాఫ్ మాత్రం కొంచం డల్ అయ్యిందని..క్లైమాక్స్ వల్ల సినిమాకు హైలెట్ అని కామెంట్స్ చేసారు.

Read More: 2025 వరకూ సమంతకు కష్టాలు తప్పవు: వేణు స్వామి

Next Story