- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకేరోజు థియేటర్స్‌లోకి రాబోతున్న 16 సినిమాలు .. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం!
ప్రతి నెల థియేటర్స్‌లో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ సినీ ప్రియులను అలరిస్తుంటాయి. ఇక ఈ నెల పెద్ద చిత్రాలు చాలానే విడుదలకు సిద్ధమవుతున్నాయి.

దిశ, సినిమా: ప్రతి నెల థియేటర్స్‌లో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ సినీ ప్రియులను అలరిస్తుంటాయి. ఇక ఈ నెల పెద్ద చిత్రాలు చాలానే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఏడాది చివరన క్రిస్మస్‌కు పోటాపోటీగా స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాక్సాఫీసును షేక్ చేయనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ‘అఖండ-2’ విడుదల కావాల్సి ఉండగా..పలు కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో మొదటి వారం అంతగా థియేటర్స్‌లో సందడి కనిపించలేదు. ఇక ఈ వారం మాత్రం చాలా సినిమాలే థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. ఒకే రోజు ఏకంగా.. 16 చిత్రాలు విడుదల కాబోతుండటం విశేషం. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చిన్న సినిమాలే అయినా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం అని అంటున్నారు.
డిసెంబర్ 12న విడుదల కాబోతున్న సినిమాలు..
1. మోగ్లీ
2. సకుటుంబనాం
3. నా తెలుగోడు
4. పైసావాలా
5. ఈషా
6. సైక్ సిద్ధార్థ్
7. మిస్టీరియస్
8. ఫెయిల్యూర్ బాయ్స్
9. వన్ బై ఫోర్
10. ఇట్స్ ఒకే గురు
11. కామ అండ్ డిజిటల్ సూత్రాస్
12. డ్రైవ్
13. అన్నగారు వస్తారు
14. లాక్ డౌన్
15. ఎవడి సినిమాకి వాడే హీరో
16. ఘంటసాల
ఇక ఇందులో ఇంట్రెస్టింగ్ సినిమాల విషయానికొస్తే..
సైక్ సిద్ధార్థ్(Psych Siddharth): నందు, యామిని భాస్కర్ (Yamini Bhaskar)జంటగా నటిస్తున్నారు. కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా డిసెంబర్ 12న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా చేశాయి.
మోగ్లీ:
రోషన్ కనకాల హీరోగా రాబోతున్న రెండో ప్రాజెక్ట్. దీనికి నేషనల్ అవార్డు విన్నర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రోషన్ సరసన సాక్షి మండోద్కర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అన్నగారు వస్తారు: కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రాబోతుంది. ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ విడుదలైన అప్డేట్స్ వల్ల ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు డిసెంబర్ 12న విడుదల కానుంది.






