- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
15 సెకన్లే సవాల్‌గా మారాయి అలా చేయకతప్పడం లేదు.. తమన్నా భాటియా ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా వరుస సినిమాలే కాకుండా ఓటీటీలో వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. గత ఏడాది ఈ అమ్మడు నటించిన జైలర్ మూవీ, లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించాయి. అలాగే ఈ ఏడాది ‘అరుణ్మై-4’ తెలుగులో బాక్ పేరుతో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మిల్కీ బ్యూటీ ఓ వైపు సినిమాలు చేస్తూనే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలకు తెలుపుతూ.. ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటోంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ ఒకప్పుడు థియేటర్స్‌లోనే సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీలో కూడా ఎన్నో సినిమాలు విడుదల అవుతున్నాయి. మొత్తం థియేటర్స్‌లో విడుదలయ్యే మూవీస్ కంటే ఓటీటీలో రిలీజ్ అయ్యేవాటికే మొగ్గు చూపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో పదిహేను సెకన్ల పాటు ఉండే రీల్స్‌కు కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి.
జనాలను ఆకట్టుకోవాలంటే రీల్స్ తప్పక చేయాల్సి వస్తుంది. ఆకట్టుకునేందుకు వారికి నచ్చిన కథల్ని తెరపైకి తీసుకురావడమే నటీమణులకు సవాలుగా మారింది. ఆ రీల్స్ ఏ అందరికీ పెద్ద పోటీగా నిలిచాయి’’ అని చెప్పుకొచ్చింది. ఇక తమన్నా భాటియా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల తన రిలేషన్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో మాత్రం చెప్పలేదు. దీంతో నిత్యం తమన్న- విజయ్ పెళ్లి గురించే పలు వార్తలు వస్తున్నాయి.
- Tags
- Tamannaah Bhatia