- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడ్డకట్టే చలిలో 12 గంటల పని.. ప్రియాంక డెడికేషన్‌కు సెల్యూట్ చేస్తున్న దర్శకుడు!
ప్రియాంక, మన సినిమా గురించి, ముఖ్యంగా నీ పర్ఫార్మెన్స్ గురించి నాకు వరుసగా కాల్స్, వాయిస్ నోట్స్ వస్తున్నాయి. ఇది నాకు చాలా సంతోషాన్నిస్తోంది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె లేటెస్ట్ మూవీ ‘మేడ్ ఇన్ కొరియా’ (Made in Korea) విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో, చిత్ర దర్శకుడు రా కార్తీక్ ప్రియాంకపై ఉన్న తన కృతజ్ఞతను చాటుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. షూటింగ్ సమయంలో ప్రియాంక చూపించిన డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ మొత్తం ఫిదా అయిపోయింది. ఈ విషయంపై దర్శకుడు స్పందిస్తూ.. "ప్రియాంక, మన సినిమా గురించి, ముఖ్యంగా నీ పర్ఫార్మెన్స్ గురించి నాకు వరుసగా కాల్స్, వాయిస్ నోట్స్ వస్తున్నాయి. ఇది నాకు చాలా సంతోషాన్నిస్తోంది. 'మనం ఎలాగైనా ఒక మంచి సినిమా తీయాలి, కచ్చితంగా సక్సెస్ అవ్వాలి' అని నువ్వు పదే పదే చెప్పే మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను" అని ఎమోషనల్ అయ్యారు.
ముఖ్యంగా కొరియా షెడ్యూల్ గురించి దర్శకుడు కార్తీక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అక్కడ గడ్డకట్టే చలి, కఠినమైన వాతావరణం ఉన్నప్పటికీ ప్రియాంక ఏమాత్రం వెనుకాడలేదట. ప్రతిరోజూ దాదాపు 12 గంటలకు పైగా నిరంతరాయంగా పనిచేస్తూ టీమ్ అందరిలోనూ జోష్ నింపిందని కొనియాడారు. ఎంతటి ఇబ్బంది ఎదురైనా అడ్జస్ట్ అవుతూ, సినిమా కోసం ఆమె పెట్టిన శ్రమ వెలకట్టలేనిదని ఆయన ప్రశంసించారు. ఈ సినిమాతో ప్రియాంక మోహన్ తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కిందని చెప్పవచ్చు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆమె అద్భుతంగా రాణించిందని ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒక రకంగా ప్రియాంక డెడికేషనే ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిందని చిత్ర బృందం నమ్ముతోంది.






