‘PS-2’ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లోనే

by Disha Web Desk 7 |
‘PS-2’ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లోనే
X

దిశ, సినిమా: గతేడాది బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్న చిత్రాల్లో ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ఒకటి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి, త్రిష, జయం రవి, జయరామ్, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘PS-2’ సినిమా ఏప్రిల్ 28వ విడుదలకానుంది. దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. ‘నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్’ లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. దీన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక సాలిడ్ పోస్టర్ రివీల్ చేశారు మేకర్స్.

Also Read..

'పీఎస్-2' తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

Next Story

Most Viewed