‘ఆప్’ ఎంపీతోనే పరిణీతి పెళ్లి.. త్వరలోనే అధికారిక ప్రకటన

by Disha Web Desk 9 |
‘ఆప్’ ఎంపీతోనే పరిణీతి పెళ్లి.. త్వరలోనే అధికారిక ప్రకటన
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రముఖ రాజకీయ నాయకుడిని పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ‘ఆప్’ ఎంపీ రాఘవ్ చద్దాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ ఇటీవల ఓ హోటల్ నుంచి బయటకొస్తూ ఒకే కారులో కలిసి వెళ్లడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే ‘ఈ జంట లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలసి చదువుకున్నారు. ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు కలిశాయి. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఇరు కుటుంబాల పెద్దలు చర్చలు జరుపుతున్నారు. అతి త్వరలోనే ఈ వేడుక జరగనుంది’ అని సన్నిహిత వర్గాలు చెప్పినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో సీరియస్ చర్చ నడుస్తోంది. ఇక ప్రస్తుతం పరిణీతి రెండు ప్రాజెక్టులో ఫుల్ బిజీగా ఉంది.

Next Story

Most Viewed