Coolie Twitter Review:‘కూలీ’ మూవీ ట్విట్టర్ రివ్యూ.సినిమా ఎలా ఉందంటే.?

by I. Sairam |   (  Updated:2025-08-14 08:16:32  IST  )

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన తాజా చిత్రం ‘కూలీ’(coolie).

Coolie Twitter Review:‘కూలీ’ మూవీ ట్విట్టర్ రివ్యూ.సినిమా ఎలా ఉందంటే.?
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన తాజా చిత్రం ‘కూలీ’(coolie). నాగార్జున(Nagarjuna) కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతిహాసన్(Sruthi Haasan), పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్లుగా నటించారు. అయితే దీనిని సన్ పిక్చర్స్(Sun Pictures) భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాకి అనిరుధ్(Anirudh) సంగీతం అందించారు. అయితే ఈ చిత్రం నేడు ఆగస్టు 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అయింది. అయితే ఇప్ప‌టికే సినిమా చూసిన వారు చాలామంది త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. మరి ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం..

ఫస్ట్ ఆఫ్ చాలా బాగుందని, ఇక సెకెండ్ ఆఫ్ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదని రజినీకాంత్ చించేశారనీ తెలుపుతున్నారు. అలాగే ఇందులోని న‌టులంద‌రి ఇంట్రో స‌న్నివేశాలు సైతం డిఫ‌రెంట్‌గా మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయ‌ని ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు. స‌త్య‌రాజ్ ఆయ‌న‌ కూతురు శృతిహ‌స‌న్ క‌లిసి సైమ‌న్ అక్ర‌మాల‌పై ప్రారంభించిన ఓ మిష‌న్ ఫెయిల్ అవుతున్న స‌మ‌యంలో స‌త్య‌రాజ్ ఫ్రెండ్ ర‌జినీ ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిరుగుతుంద‌ని అంటున‌్నారు.

ఈ క్ర‌మంలో ర‌జ‌నీకి మిత్రుడిగా ఉపేంద్ర ఎంట్రీ, క్లైమాక్స్‌లో అమీర్ ఖాన్ ఆక‌ట్టుకుంటార‌ని చెబుతున్నారు. రెగ్యుల‌ర్ ప్రిడ‌క్ట‌బుల్ స్టోరీనే అయిన‌ప్ప‌టికీ లోకేశ్ మ‌రోమారు త‌న మార్క్ చూయించాడ‌ని అంటున్నారు. నాగార్జున (Nagarjuna), ర‌జ‌నీల మ‌ధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ అదిరింద‌ని థియేట‌రిక‌ల్ ఎక్స్పీరియ‌న్స్ చేయాల్సిన మూవీ అన్ని స్ప‌ష్టం చేస్తున్నారు. అలాగే పూజా హెగ్డే చేసిన మోనిక సాంగ్ కూడా చాలా బాగుందని ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.

లింక్

Also Read..

War 2 Twitter Review: వార్ 2 ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..?

Next Story