‘L2:ఎంపురాన్’ ట్విట్టర్ రివ్యూ.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్లు నెవ్వర్ బిఫోర్ అనేలా ఉన్నాయంటూ పోస్టులు

by I. Sairam |   (  Updated:2025-03-27 12:42:13  IST  )

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్ (mohanlal), పృథ్వీరాజ్ సుకుమార్(Prithviraj Sukumaran) కాంబోలో తెర‌కెక్కిన భారీ చిత్రం ‘L2:ఎంపురాన్’(L2: Empuraan).

‘L2:ఎంపురాన్’ ట్విట్టర్ రివ్యూ.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్లు నెవ్వర్ బిఫోర్ అనేలా ఉన్నాయంటూ పోస్టులు
X

శ, వెబ్‌డెస్క్: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్ (mohanlal), పృథ్వీరాజ్ సుకుమార్(Prithviraj Sukumaran) కాంబోలో తెర‌కెక్కిన భారీ చిత్రం ‘L2:ఎంపురాన్’(L2: Empuraan). అయితే ఈ చిత్రం 2019లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన ‘లూసిఫ‌ర్‌’కు సీక్వెల్‌గా రాబోతుంది. ఇక ఈ మూవీ మూడు భాగాలుగా రాబోతుండగా.. ఇది రెండో భాగం కావడం విశేషం. అయితే ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. కాగా ‘ఎంపురాన్-2’ను తెలుగు రాష్ట్రాల్లో దిల్‌రాజుకు చెందిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్(Sri Venkateswara Creations) విడుద‌ల చేస్తుంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్(Manju Warrier), సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. అలాగే ఓ'నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్(Kartikeya Dev) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక మ‌ల‌యాళంతో పాటు తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో మార్చి 27న అనగా నేడు ఈ మూవీ గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ మూవీకు సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇక కథ విషయానికి వస్తే.. భారతదేశంలోని ఒక హవేలీలో మత అల్లర్లు చెలరేగుతుంటాయి. అప్పుడు బలరాజ్ భాయ్ (అభిమన్యు సింగ్) నేతృత్వంలోని హిందూ ప్రజలు ముస్లింలను చంపుతుంటారు. అప్పుడే ఇరాక్‌లో ఒక బ్లాస్ట్‌తో ఖురేషి అబ్రమ్ (మోహన్ లాల్) ఎంట్రీ అవుతారు. ఆ తర్వాత కథ కాస్త కేరళకు షిఫ్ట్ అవుతుంది. అక్కడ మంజు వారియర్ ఎంటర్ అవుతుంది. అలాగే గోవర్ధన్ (ఇంద్రజిత్ సుకుమారన్) ఖురేషీని కలవాలని అనుకుంటాడు. దానికోసం ఓ డ్రగ్ డీలర్‌ను కలుస్తాడు. అప్పుడు అక్కడ ఒక భారీ బ్లాస్ట్ జరుగుతుంది. దీంతో అసలు అక్కడ ఖురేషికి ఏం జరిగింది అనే సస్పెన్స్‌తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంటుంది. ఇక ఇంటర్వెల్ అనంతరం.. కేరళలో కొన్ని పొలిటికల్ సీన్స్ తో కథ స్టార్ట్ అవుతుంది.. ప్రియదర్శినిని జతిన్ కీలక పార్టీ మీటింగ్‌కి రాకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ప్రియదర్శిని పై అటాక్ జరగడంతో ఖురేషి ఆమెను కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. అయితే అసలు ఖురేషి ఆ బాంబ్ బ్లాస్ట్ లో నుంచి ఎలా తప్పించుకున్నాడు.. ప్రియదర్శినిపై అటాక్ చేసింది ఎవరో తెలియాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే..

ఎల్2: ఎంపురాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. 'ఎల్ 2 ఎంపురాన్' సినిమా చూసిన జనాలు అందరూ చెప్పే మాట ఒక్కటే... క్లైమాక్స్ కుమ్మేసిందని! థియేటర్ల నుంచి ప్రేక్షకులను బయటకు పంపించే ముందు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ భారీ హైప్ ఇచ్చి పంపించారట‌. అలాగే ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఎంట్రీ అదిరిపోయిందని చెబుతున్నారు. పృథ్వీరాజ్ మేకింగ్ ఎక్స్‌లెంట్ అని, అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ అని అంటున్నారు. ఇక ఇంటర్వెల్‌కు గూస్ బంప్స్ అని, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్లు నెవ్వర్ బిఫోర్ అనేలా ఉన్నాయట. ఇక ఇదే కాకుండా మూడో పార్ట్ కోసం ఇచ్చిన హింట్ నెక్ట్స్ లెవెల్ అని అంటున్నారు.

అలాగే రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలలో 'ఎల్ 2 ఎంపురాన్' ఒకటి అవుతుందని ఆల్రెడీ ప్రీమియర్ షోస్ చూసిన వాళ్ళు చెబుతున్నారు. క్లైమాక్స్ అయిపోయిన వెంటనే సీట్ల నుంచి లేచి బయటకు రావద్దని, పోస్ట్ క్రెడిట్ సీన్ అసలు మిస్ కావద్దని తెలిపారు. 'ఎల్ 2 ఎంపురాన్' సీక్వెల్ కోసం క్లైమాక్స్ తర్వాత ఒక సర్ప్రైజ్ సీన్ ప్లాన్ చేశారట. అది మరింత బావుంటుందని చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసేయండి.

Next Story