పోలీసులే చంపారు.. ‘రాజు’ భార్య మౌనిక సంచలన వ్యాఖ్యలు

884

దిశ, వెబ్‌డెస్క్ : తన భర్త రాజును పోలీసులే తీసుకెళ్లి హత్య చేశారని సైదాబాద్ హత్యాచార నిందితుడి భార్య మౌనిక ఆరోపించారు. తన భర్త అత్యాచారాలకు పాల్పడే వ్యక్తి కాదని, ఒకవేళ అత్యాచారం చేసినా న్యాయపరంగా శిక్షించాలని ఆమె అన్నారు.

తన భర్త ఇన్ని రోజులు పోలీసుల అదుపులోనే ఉన్నాడని, ఆయనను చిత్రహింసలకు గురి చేసి చంపేశారని కన్నీరు పెట్టుకున్నారు. తన భర్త శవాన్ని తనకు అప్పగించాలని పోలీసులను కోరారు. రాజు తల్లి సైతం పోలీసులపై ఆరోపణలు చేశారు. తన కుమారుడు ఏమీ తెలియని అమాయకుడని, పోలీసులే పొట్టన పెట్టుకున్నారని విమర్శలు చేశారు.

ఇవి కూడా చదవండి:

ట్రాక్‌పై రాజు డెడ్ బాడీ.. ప్రత్యేక్ష సాక్షులు ఏం చెప్పారంటే..?

రాజు డెడ్‌బాడీపై డౌట్.. చిన్నారి పేరెంట్స్ ఏం అంటున్నారంటే..

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..