మోటో జీపీ జపాన్ గ్రాండ్ ప్రీ రద్దు

by  |
మోటో జీపీ జపాన్ గ్రాండ్ ప్రీ రద్దు
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ ప్రభావం మరో ఆటపై పడింది. జపాన్‌లో నిర్వహించే ది మోటో జీపీ గ్రాండ్ ప్రీ కొవిడ్-19 నేపథ్యంలో రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16 నుంచి 18 వరకు ట్విన్ రింగ్ మోటేజీ నిర్వహించాల్సి ఉంది. కానీ, ఈ ఏడాది ఈ టోర్నీని నిర్వహించడం లేదని ప్రకటించారు. 21 ఏళ్ల చరిత్ర కలిగిన జపాన్ గ్రాండ్‌ ప్రీ అనూహ్యంగా రద్దవ్వడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఈ ఏడాది జరగాల్సిన ఆస్ట్రేలియా, బ్రిటిష్ గ్రాండ్ ప్రీలను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్లే రద్దు చేసినట్లు దోర్న స్పోర్ట్స్ సీఈవో కార్మెలో స్పష్టం చేశారు.

Next Story

Most Viewed