అల్లుడిని హత్య చేసిన అత్త

by  |
murder
X

దిశ, వెబ్‎డెస్క్: తన కూతురు ఆత్మహత్యకు ప్రతీకారంగా అల్లుడిని దారుణంగా హత్య చేసింది అత్త. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్‎కు చెందిన నవీన్‎కు మీర్‎పేటకు చెందిన ఓ యువతితో వివాహమైంది. పెళ్లి అయిన నెల‌కే న‌వీన్ భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. భార్య ఆత్మహత్య కేసులో నవీన్ జైలుకు వెళ్లాడు.

ఇటీవ‌లే న‌వీన్ జైలు నుంచి విడుద‌ల అయ్యాడు. విష‌యం తెలుసుకున్న అత్త అనిత‌ గురువారం ఉదయం నవీన్ ఇంటికి వెళ్లి అల్లుడిపై కత్తితో దాడి చేసి చంపింది. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న ఉప్ప‌ల్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. న‌వీన్ మ‌రో అమ్మాయితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగించ‌డం వ‌ల్లే తన కూతురు ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని, ఆ కోపంతోనే అనిత ఈ దారుణానికి ఒడిగ‌ట్టి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.



Next Story

Most Viewed