- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబులెన్స్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి
<p>దిశ, మణుగూరు: అంబులెన్స్‌లో ఓ గర్భిణీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన రమాదేవి(గర్భిణీ) బుధవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు వస్తుండటంతో కుటుంబ సభ్యులు ‘108’కు కాల్ చేశారు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్ అశ్వాపురం మండలానికి చేరుకుంది. అయితే ఈ క్రమంలో గర్భిణీని మల్లెలమడుగు గ్రామం నుంచి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఇరవెండి-మల్లెలమడుగు మార్గమధ్యలో పురిటి నొప్పులు మరింత ఎక్కువ అయ్యాయి. దీంతో ‘108’అంబులెన్స్‌లోనే […]</p>

దిశ, మణుగూరు: అంబులెన్స్‌లో ఓ గర్భిణీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన రమాదేవి(గర్భిణీ) బుధవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు వస్తుండటంతో కుటుంబ సభ్యులు ‘108’కు కాల్ చేశారు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్ అశ్వాపురం మండలానికి చేరుకుంది. అయితే ఈ క్రమంలో గర్భిణీని మల్లెలమడుగు గ్రామం నుంచి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఇరవెండి-మల్లెలమడుగు మార్గమధ్యలో పురిటి నొప్పులు మరింత ఎక్కువ అయ్యాయి. దీంతో ‘108’అంబులెన్స్‌లోనే సిబ్బంది డెలివరీ చేయగా.. పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. తల్లి-బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని, మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. డెలివరీ సమయంలో సిస్టర్ ఉదయకుమారి (టెక్నీషియన్), డ్రైవర్ నరసింహారావు ఉన్నారు.






