- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: తమ వ్యవసాయ భూమిని ఓ రాజకీయ నేత కబ్జా చేస్తున్నారని కలెక్టరేట్ ఎదుట తల్లీకొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. డిచ్పల్లి మండలం యానాంపల్లికి చెందిన గడిల గంగవ్వ, ఆమె కొడుకు గంగా కిషన్.. ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగా కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు. తమ 3.20 ఎకరాల వ్యవసాయ భూమిని […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తమ వ్యవసాయ భూమిని ఓ రాజకీయ నేత కబ్జా చేస్తున్నారని కలెక్టరేట్ ఎదుట తల్లీకొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. డిచ్పల్లి మండలం యానాంపల్లికి చెందిన గడిల గంగవ్వ, ఆమె కొడుకు గంగా కిషన్.. ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగా కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు. తమ 3.20 ఎకరాల వ్యవసాయ భూమిని ఎమ్మెల్యే బాజిరెడ్డి అనుచరుడిని అంటూ స్థానిక జడ్పీటీసీ భర్త లక్ష్మీ నర్సయ్య కబ్జా చేశారని గంగవ్వ ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని తల్లీకొడుకులు డిమాండ్ చేశారు. న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు.



Next Story






