- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేటలో పారిన రక్తపుటేర్లు.. తల్లీకూతుళ్ల దారుణ హత్య
by Batti.Sumithra |
<p>దిశ, హుస్నాబాద్ : ఇరువర్గాల మధ్య భూ వివాదం కాస్త హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మడద గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు గుగ్గిళ్ళ సారవ్వ(60), ఉసికే నిర్మల (30)కు సమీప బంధువులతో కొంత కాలంగా భూ వివాదం నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో గొడవ కాస్త తారా స్థాయికి చేరుకుందని స్థానికులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే వ్యవసాయ పొలం వద్ద తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. అయితే, సమీప బంధువు శ్రీనివాస్ […]</p>

X
దిశ, హుస్నాబాద్ : ఇరువర్గాల మధ్య భూ వివాదం కాస్త హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మడద గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు గుగ్గిళ్ళ సారవ్వ(60), ఉసికే నిర్మల (30)కు సమీప బంధువులతో కొంత కాలంగా భూ వివాదం నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో గొడవ కాస్త తారా స్థాయికి చేరుకుందని స్థానికులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే వ్యవసాయ పొలం వద్ద తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు.
అయితే, సమీప బంధువు శ్రీనివాస్ వీరిని హత్య చేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అడిషనల్ ఎస్పీ సందెపోగు మహేందర్, ఎస్ఐ సజ్జనపు శ్రీధర్ ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
Next Story






