- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడి మోసం.. గోదావరిలో దూకిన తల్లీకూతుర్లు
<p>దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా బాసరలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియుడు మోసం చేయడంతో భరించలేక గురువారం తల్లి తన బిడ్డతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించిన కానిస్టేబుల్ వారిని రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.వివరాల్లోకివెళితే.. ఇదివరకే పెళ్లయి భర్త నుంచి విడాకులు తీసుకున్న కార్తీక అనే మహిళ సురేశ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతడు కూడా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని […]</p>

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా బాసరలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియుడు మోసం చేయడంతో భరించలేక గురువారం తల్లి తన బిడ్డతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించిన కానిస్టేబుల్ వారిని రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.వివరాల్లోకివెళితే.. ఇదివరకే పెళ్లయి భర్త నుంచి విడాకులు తీసుకున్న కార్తీక అనే మహిళ సురేశ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతడు కూడా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగేసరికి మొహం చాటేసాడు. దీంతో మనస్తాపం చెందిన కార్తీక తన బిడ్డతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యయత్నం చేసింది. కానిస్టేబుల్ ఆమెను రక్షించి పీఎస్‌కు తీసుకెళ్లి వివరాలు సేకరించగా అసలు విషయం వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రేమపేరుతో మోసం చేసిన నిందితుడు సురేష్‌ను అరెస్టు చేసినట్లు బాసర పోలీసులు తెలిపారు.






