- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
by Shyam |
<p>దిశ, పటాన్‌చెరు: అక్కను చూసేందుకు ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెప్పి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…. తన అక్క డెలివరీ అయితే చూడటానికి వెళ్లేందుకు అమీన్ పూర్ మండలం శ్రీ రామ్ నగర్ కాలనీకి చెందిన దానోల్ల దేవిశ్రీ (21), తన కూతురు ఇందుప్రియ ( 5) కొడుకు సుశాంత్ (3)లతో కలిసి ఈ నెల 17న తయారైంది. ఈ మేరకు […]</p>

X
దిశ, పటాన్‌చెరు: అక్కను చూసేందుకు ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెప్పి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే….
తన అక్క డెలివరీ అయితే చూడటానికి వెళ్లేందుకు అమీన్ పూర్ మండలం శ్రీ రామ్ నగర్ కాలనీకి చెందిన దానోల్ల దేవిశ్రీ (21), తన కూతురు ఇందుప్రియ ( 5) కొడుకు సుశాంత్ (3)లతో కలిసి ఈ నెల 17న తయారైంది. ఈ మేరకు తన ఇంటి ముందు ఉండే మహేశ్ అనే వ్యక్తి తో కలిసి టీఎస్ 34 టీఏ 5206 నెంబర్ గల ఆటోలో బయలు దేరింది. ఆ తర్వాత పటాన్‌చెరు బస్టాండ్ లో దిగింది. కానీ ఆమె సంగారెడ్డి ఆస్పత్రి వెళ్లలేదు. తిరిగి ఇంతవరకు ఇంటికి రాలేదు. తెలిసిన వారి, బంధువుల వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఆమె భర్త శేఖర్ ఫిర్యాదు చేశారు.
Next Story






