యూట్యూబ్ మ్యూజిక్ చార్ట్స్‌ టాప్ 4లో టాలీవుడ్ సాంగ్…

by  |
యూట్యూబ్ మ్యూజిక్ చార్ట్స్‌ టాప్ 4లో టాలీవుడ్ సాంగ్…
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అక్కినేని వారసుడు అఖిల్ పూజాహెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘లెహరాయి’ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో యువ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ‘లెహరాయి’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయగా.. మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ మేరకు ఇప్పటి వరకు 6 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకొని యూట్యూబ్ మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ 4లో ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ ద‌ర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed