ఆ బ్యాచిలర్.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను తట్టుకుంటాడా ?

by  |
akhil
X

దిశ, సినిమా : బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ అక్కినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఫిల్మ్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించిన చిత్రంలో అఖిల్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న మూవీ.. అక్టోబర్ 8న రిలీజ్ కాబోతుందని ఇన్‌స్టాలో వెల్లడించాడు అఖిల్. ఎగ్జైటింగ్ అప్‌డేట్స్, ప్రమోషన్స్ త్వరలోనే స్టార్ట్ అవుతాయని క్లారిటీఇచ్చాడు. అయితే ఐదు రోజుల వ్యవధిలో అక్టోబర్ 13న రాజమౌళి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల అవుతుండగా.. ఆ ఫిల్మ్ మేనియాను అఖిల్ తట్టుకుంటాడా? లేదా? అనే డౌట్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి సరైన హిట్ లేక సతమవుతున్న అక్కినేని హీరోకు ఈసారైనా కలిసొస్తుందా? లేదా తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.


Next Story

Most Viewed