మోస్ట్ అవెయిటెడ్ వెబ్ సిరీస్‌లు.

by  |
మోస్ట్ అవెయిటెడ్ వెబ్ సిరీస్‌లు.
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నవి ఓటీటీలే. కొత్త కొత్త సినిమాలతో పాటు సినిమాలకు ఏ మాత్రం తగ్గని వెబ్ సిరీస్‌లతో ఓటీటీలు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. అక్టోబర్ నెల ప్రారంభమైంది. మరి ఈ నెలలో ప్రముఖ ఓటీటీల్లో రాబోయే వెబ్ సిరీస్‌లు ఏమిటి? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి?

‘స్కామ్ 1992 – ద హర్షద్ మెహతా స్టోరీ’

స్టాక్ మార్కెట్ చరిత్రలో జరిగిన భారీ మోసం ‘1992 స్కామ్’. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా ఈ స్కామ్‌లో కీలక సూత్రధారి. 5వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ అతడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992- ద హర్షద్ మెహతా స్టోరీ’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సిరీస్‌పై ఆసక్తిని పెంచింది. ‘ది స్కామ్ బై దెబషిష్ బసు అండ్ సుచేత దలాల్’ అనే పుస్తకం ఆధారంగా హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రతీక్ గాంధీ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్.. సోనీ లైవ్‌లో త్వరలోనే రానుంది.
– విడుదల : అక్టోబర్ 9

పాయిజన్ 2

2019లో విడుదలైన ‘పాయిజన్’ వెబ్ సిరీస్ యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘పాయిజన్ -2’ రాబోతుంది.
ఇందులో రాయ్‌లక్ష్మీ, పూజా చోప్రా, రాహుల్ దేవ్, అఫ్తాబ్ శివ్‌దాసాని, అస్మిత సూద్, పవన్ చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
– విడుదల : అక్టోబర్ 16 (జీ5)

మిర్జాపూర్ 2

మీర్జాపూర్ ప్రాంతంలో ఉండే ఓ మాఫియా డాన్‌ అఖండానంద్. అతడి కొడుకు పేరు మున్నా. ఆ ప్రాంతంలోనే ఉండే ఓ లాయర్ కొడుకులైన గుడ్డు, బబ్లూలతో మున్నాకు శత్రుత్వం ఏర్పుడుతుంది. వీరి మధ్య ఏం జరుగుతుంది అన్నదే ‘మీర్జాపూర్’ తొలి సీజన్ కథ. ఇది సూపర్ డూపర్ హిట్ కావడంతో.. మీర్జాపూర్ 2 గురించి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తొలి కథ ముగింపు నుంచి మళ్లీ కథ మొదలవుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ రీజియన్‌లో కరప్షన్, క్రైమ్, గవర్నన్స్ ఫెయిల్యూర్, రూల్ ఆఫ్ మాఫియా డాన్స్, గ్యాంగ్ వార్స్ ఎలాంటి ప్రభావం చూపాయన్న కథాంశంతో మీర్జాపూర్ 2 తెరకెక్కింది.
– విడుదల : అక్టోబర్ 23 (అమెజాన్ ప్రైమ్)

రాబోయే వెబ్ సిరీస్‌లు :

కామెడీ కపుల్ – అక్టోబర్ 21 (జీ5)
ఏక్ జ్యోతి లవ్ స్టోరీ – అక్టోబర్ 30 (జీ5)
గందీ బాత్ ఎస్ 5 – అక్టోబర్ 8 ( ఏఎల్‌టీ బాలాజీ)

సినిమాలు :

గిన్ని వెడ్స్ సన్నీ – అక్టోబర్ 9 ( నెట్‌ఫ్లిక్స్)
థాయిష్ – అక్టోబర్ 29 (జీ5)


Next Story

Most Viewed