ఫస్ట్ సింగిల్‌తో దూసుకొచ్చిన ‘మోసగాళ్లు’

by  |
ఫస్ట్ సింగిల్‌తో దూసుకొచ్చిన ‘మోసగాళ్లు’
X

దిశ, సినిమా: ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గి చిన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రూహి సింగ్, నవీన్ చంద్ర, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా.. తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లోనూ డబ్ కానుంది. ఎకానమీ బేసిస్‌లో జనరేషన్స్ మధ్య కల్చరల్ క్లాష్, ధనిక పేద మధ్య తేడాలను ఈ మూవీలో డైరెక్టర్ అత్యద్భుతంగా చూపించబోతున్నారని సమాచారం.

ఏసీపీ కుమార్‌గా ఐటీ కుంభకోణానికి పాల్పడ్డ నిందితులను పట్టుకునే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి కనిపించనున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌‌పై మంచు విష్ణు స్వయంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘డబ్బే మ‌న‌ది కుమ్మేస్కో’ అనే లిరికల్ వీడియో రిలీజైంది. సామ్ సంగీత సార‌థ్యంలో హేమచంద్ర పాడిన ఈ ఫస్ట్ సింగిల్ సినీప్రియులను ఆకట్టుకుంటోంది.



Next Story

Most Viewed