- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఏడాది సాధారణ వర్షపాతమే : ఐఎండీ
<p>న్యూఢిల్లీ : ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర భూగర్భ మంత్రిత్వ శాఖ (ఎర్త్ సైన్సెస్) సెక్రెటరీ ఎం. రాజీవన్ ఆన్లైన్ ద్వారా మీడియాకు వివరాలను వెల్లడించారు. నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో 98 శాతం వర్షపాతం నమోదవుతుందని ఆయన తెలిపారు. భారత్ లో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈసారి ఆ 4 నెలల కాలంలో వర్షపాతం 96 […]</p>

న్యూఢిల్లీ : ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర భూగర్భ మంత్రిత్వ శాఖ (ఎర్త్ సైన్సెస్) సెక్రెటరీ ఎం. రాజీవన్ ఆన్లైన్ ద్వారా మీడియాకు వివరాలను వెల్లడించారు. నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో 98 శాతం వర్షపాతం నమోదవుతుందని ఆయన తెలిపారు. భారత్ లో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈసారి ఆ 4 నెలల కాలంలో వర్షపాతం 96 శాతం నుంచి 104 శాతం మధ్య ఉంటుందని ఐఎండీ తెలిపింది. సగటున అది 98 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనావేసింది. లాంగ్ పీరియడ్ యావరేజ్ (ఎల్‌పీఎ) ఆధారంగా ఈ అంచనావేస్తారు. భారత్ లో సాధారణంగా జూన్ 1 న నైరుతి రుతు పవనాలు కేరళను తాకుతాయి. ఇవే దేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకం. కాగా, గతేడాది కూడా సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసినా.. దానికి మించి వర్షాలు కురిసిన విషయం విదితమే.






