ఆ రాశి వారికి గుడ్‌న్యూస్.. జాతకం అద్భుతమే!

by  |
Panchangam
X

తేది : 28, జూన్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చవితి
(నిన్న సాయంత్రం 4 గం॥ 1 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 22 ని॥ వరకు)
నక్షత్రం : ధనిష్ట
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 26 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 52 ని॥ వరకు)
యోగము : విష్కంభము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 53 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 15 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 37 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 15 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 2 గంటల వరకు)

మేష రాశి: ఆశావాహ దృక్పథం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. సంఘంలో పేరుప్రతిష్టలు. ఈరోజు మీ గురించి మీరు ఆలోచించుకోండి. అలాగే కుటుంబం లోని పెద్ద వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. జరిగిపోయిన విషయాలను గురించి ఆలోచించడం వలన అనవసర గందరగోళంలో పడతారు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం బాగున్నా అనవసరపు ఖర్చులు వలన డబ్బుకు ఇబ్బంది. ఇతరులకు తొందరపడి మాట ఇవ్వకండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృషభ రాశి: కొంతమందికి విదేశీ ప్రయాణం అవకాశం. ఆడంబరాల కోసం ఖర్చు పెట్టకండి. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఇతరులతో సహనంగా ఆలోచించి మాట్లాడండి. వ్యాపార విస్తరణ కోసం ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

మిధున రాశి: ఉదయం సూర్యుడికి ఎదురుగా నిలబడండి. ఆరోగ్యం చక్కబడుతుంది. ఆశావాహ దృక్పథం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు. వారిని గమనించండి. పై చదువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు టీవీ, సెల్ ఫోన్లు పక్కన పెట్టండి. సమయం వృధా చేయకండి. ఆదాయం బాగుంది పాతబాకీలు వసూలవుతాయి. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. అదనపు బాధ్యతల వలన అధిక శ్రమ. దాని వలన తలనొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలు మరిచిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

కర్కాటక రాశి: పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశీ సంబంధం కుదిరే అవకాశం. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. స్థిరాస్తి వ్యవహారాలు లాభాలను తెస్తాయి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నం చేయండి. లేకుంటే పై అధికారులతో మాటలు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి వారితో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. అనవసరపు ఖర్చులను నివారించండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కన్యారాశి: రాజకీయ నాయకులకు శుభఫలితాలు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ప్రేమికులు వారి ప్రేమను గురించి ధైర్యంగా చెప్పవచ్చు. మీ బంధువుల దగ్గర తీసుకున్న అప్పును వెంటనే తీర్చి వేయండి. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు. కొంతమంది విదేశీ ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆఫీసులో పనులను మీరు సామర్ధ్యాన్ని ఉపయోగించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరినొకరు తప్పులు పట్టుకోవటం మానేయండి.

సింహరాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. విదేశాలలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త. భవిష్యత్ గురించి అతిగా ఊహించకండి. ఆఫీసు పనులలో అధికశ్రమ. తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆదాయం మామూలుగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి వారు బాధపడతారు. అధిక శ్రమ వల్ల కాళ్ల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి. బంధాలను తెగే వరకు లాగకండి.

ధనుస్సు రాశి: ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనుకున్న కార్యాలను సాధించాలంటే అధిక శ్రమ అవసరం. ముఖ్యంగా నిరుద్యోగులు వారి ప్రయత్నాల పట్ల అధిక శ్రద్ధ పెట్టాలి. సమయం చాలా విలువైనది. తిరిగి రాదు. మెడిటేషన్ వలన పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. మీరు నిజాయితీ గా నమ్మినది బలంగా అందరికీ చెప్పండి. కొంతమందికి ఇల్లు మార్పు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆదాయం పరవాలేదు. కొన్ని అనుకోని ఖర్చులు వలన ఆర్థిక ఇబ్బంది. కుటుంబ సభ్యులతో మీ బడ్జెట్ గురించి మాట్లాడండి. పరుషంగా మాట్లాడటం వలన వాళ్ళు హర్ట్ అవుతారు. ఆఫీసులో పనులను పూర్తి చేయాలంటే సహనం, సరైన ప్రణాళిక తప్పనిసరి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరినొకరు తప్పులు పట్టుకోవటం మానేయండి.

వృశ్చిక రాశి: ఆశావహ దృక్పథంతో, ధైర్యంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పెద్ద వారితో పరుషంగా మాట్లాడకండి. ఆఫీసు పనులలో మీ సామర్థ్యాలపై అందరూ ప్రశంసలు కురిపిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోండి మనసువిప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోండి.

తులారాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే అధిక శ్రమ అవసరం. సహనంతో ఆలోచించండి. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. చదువుపై విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు మరింత శ్రమపడవలసి . ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక అవసరం. అధిక శ్రమ వల్ల తలనొప్పి. అనుకోని ఖర్చులు వలన మానసిక అశాంతి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మరిచిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

మకర రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే మీ ప్రయత్నాలను ఒకటికి రెండు సార్లు చెయ్యాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఆ శని భగవానుని దయవలన ఇనుము వ్యాపారస్తులకు లాభాలు. ఇంట్లో శుభకార్యం. కొందరికి కొత్తగా ఇంటికి పాప/ బాబు రాబోతున్నారు. ఆఫీసులో పనులను అధిక శ్రమతో పూర్తి చేయవలసి ఉంటుంది పెండింగ్ పెట్టకండి. అనవసరపు దుబారా ఖర్చు వలన మానసిక అశాంతి. ఆరోగ్యం పర్వాలేదు అధిక శ్రమ వలన కాళ్ళనొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరినొకరు తప్పులు పట్టుకోవడం మానేయండి.

కుంభరాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టిన వారికి లాభాలు రావడానికి మరికొంత సమయం పడుతుంది. స్థిరాస్తి అమ్మకాలను వాయిదా వేయండి. ఆదాయం బాగున్నా మీ దుబారా ఖర్చులు వలన ఆర్థిక ఇబ్బంది. ఆఫీసులో పనులను అధిక శ్రమతో పూర్తి చేయవలసి ఉంటుంది సహనం వహించండి. కొంతమంది ఉద్యోగులకు ప్రమోషన్ కొంతమందికి ట్రాన్స్ ఫర్. ఫిట్ లెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. అధిక శ్రమ వలన ఒంటినొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి: స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు. కొంతమంది దైవ క్షేత్రాలను సందర్శించడానికి ప్రణాళికలు వేస్తారు. సమయాన్ని వృధా చేయకండి స్టాక్ మార్కెట్ పెట్టుబడులలో నష్టాలు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు పొందుతారు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

Next Story

Most Viewed