సోమవారం పంచాంగం, రాశిఫలాలు (10-05-2021)

by  |
సోమవారం పంచాంగం, రాశిఫలాలు (10-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చతుర్దశి
(నిన్న రాత్రి 7 గం॥ 33 ని॥ నుంచి
ఈ రోజు రాత్రి 9 గం॥ 56 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని
(నిన్న సాయంత్రం 5 గం॥ 31 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 26 ని॥ వరకు)
యోగము : ఆయుష్మాన్
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 56 ని॥ నుంచి 5 గం॥ 43 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ నుంచి మద్యాహ్నం 2 గం॥ 8 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 37 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 28 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 3 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 22 ని॥ నుంచి 8 గం॥ 58 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 48 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 24 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి 12 గం॥ 11 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 38 ని॥ లకు
సూర్యరాశి : మేషము
చంద్రరాశి : మేషము

మేష రాశి : సామాజిక సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొంటారు. డబ్బుకు సంబంధించిన కోర్టు కేసులో లావాదేవీలలో విజయ అవకాశం. ఇంటిలోని శుభకార్యములకు కొరకై రుణములు చేసే అవకాశం. ఈ రాశి స్త్రీలకు అవకాశవాదులు మళ్లీ దగ్గర చేరుతారు జాగ్రత్త.

వృషభ రాశి : ఉద్యోగంలో ప్రతి పని ఆచితూచి చెయ్యండి. మీ క్రింది పనివారితో జాగ్రత్తగా మెలగండి. విజయం మీదే. దూరపు బంధువుల రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. నలుగురికి సహాయపడాలనే మీ ప్రయత్నాలు సఫలమౌతాయి. ఈ రాశి స్త్రీలకు నమ్మిన వ్యక్తులు మిమ్ములను డబ్బు దగ్గర మోసం చేసే పరిస్థితి ఉంది. జాగ్రత్త వహించండి.

మిధున రాశి : వచ్చిన అవకాశాలను రెండు చేతుల అందిపుచ్చుకోండి. వ్యాపారంలో భాగస్వాముల ప్రవర్తన మీకు కష్టం కలిగిస్తుంది. వ్యాపార రహస్యమును ఎంత దగ్గరి వారైనా వారితో పంచుకోవద్దు. బంధువర్గం వారితో అకారణ కలహములు రావచ్చు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి స్త్రీలు స్వయంకృషితో మంచి ఉద్యోగం సాధిస్తారు.

కర్కాటక రాశి : పిల్లల అవసరాలను తీర్చడానికి ప్రయత్నించండి కానీ ఖర్చు విషయంలో కఠినంగా వ్యవహరించండి. కరోనా వల్ల వ్యాపారం దెబ్బతినే అవకాశం అందువల్ల అశాంతి. ఉద్యోగస్తులకు స్థానచలనం. ఈ రాశి స్త్రీలకు జీవితంలో కొంత మంది వ్యక్తులు దూరమవుతారు.

సింహరాశి : విద్యార్థులకు మంచి గుర్తింపు కాలము ఉద్యోగస్తులకు మంచి అనుకూలం. ఉపాధ్యాయ వృత్తిలో మరియు విద్యా సంస్థల నిర్వహణలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. కొత్త విషయాలను నేర్చుకోవాలనే మీ కుతుహలానికి తగినట్లు మీకు కొత్త స్నేహితులు లభిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీరు సంపాదించిన డబ్బు మీద మీకు హక్కు లేకుండా పోతుంది.

కన్య రాశి : దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెస్తాయి. విద్యార్థులు తమ చదువు మీద శ్రద్ధ వుంచి భవిష్యత్తు ప్రణాళికలను తగిన విధంగా వేసుకోవాలి. భార్య పిల్లలకు అనారోగ్యం వల్ల ఉత్సాహం తగ్గే అవకాశం. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఈ రాశి స్త్రీలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.

తుల రాశి : ఇతరులకు సంబంధించిన తగవులలో తల దూర్చవద్దు తీర్పును చెప్పవద్దు. మీరు వారికి విరోధులు అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో తగిన విధంగా వాస్తు మార్పులు చేస్తారు. సంఘంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. పిల్లల చదువులు, వాటి ఖర్చులు వీటి గురించి సమాలోచనలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

వృశ్చిక రాశి : ఈ కరోనా సమయంలో ఆయుర్వేద వైద్యులకు హోమియోపతి వైద్యులకు మంచి అనుకూలమైన కాలము. ఉద్యోగస్తులు departmental పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాలకు వెళ్లిన వారు తిరిగి తమ దేశానికి వచ్చే అవకాశం. ఈ రాశి స్త్రీలు తమ సహోదర సహోదరీ వర్గానికి సహాయపడతారు.

ధనుస్సు రాశి : మంచి శుభవార్త వింటారు. డబ్బును ఏ విషయం మీద ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి లేకపోతే రాబోయే రోజుల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. జీర్ణ శక్తి తగ్గటం గ్యాస్ట్రబుల్ వంటివి రావచ్చు. విదేశాలలో ఉన్న బంధుమిత్రులకు ఇక్కడి ఆస్తుల కొనుగోలు విషయంలో సహకరిస్తారు. ఈ రాశి స్త్రీలు స్వయం శక్తితో మీకు మీరుగా నిలబడ గలుగుతారు.

మీన రాశి : సంతానం యొక్క యోగక్షేమాల పైన అధిక శ్రద్ధ పెడతారు. నకిలీ స్వామీజీలు పూజల పేరుతో మీ దగ్గర నుండి డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేస్తారు భయపడతారు జాగ్రత్త. పాత వాహనములు అమ్మి కొత్త వాహనాలు కొంటారు. ఈ రాశి స్త్రీలకు విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకర రాశి : సంఘంలో మీ మాటకు గుర్తింపు మీ పలుకుబడి పెరుగుతాయి. సరైన వేళకు భోజనములు చేయలేకపోవచ్చు. మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి సమయం మీకు అనుకూలంగా ఉంది. భూమి కొనుగోలు, అమ్మకాల వల్ల లాభం పొందుతారు. ఈ రాశి స్త్రీలు కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కుంభరాశి : విదేశాలలో కెరియర్, అక్కడి వాతావరణం మీకు నచ్చక ఎక్కువ కాలం ఉండాలనిపించదు. ఎంతోకాలంగా వివాదంలో ఉన్న ఆస్తి గొడవలు ఒక కొలిక్కి వస్తాయి. భూ గృహ నిర్మాణాలు మొదట కొంచెం ఆలస్యం అయినా తరువాత చక్కబడతాయి. ఈ రాశి స్త్రీలకు మీరు కోరుకున్న చోట చదువుకోవటానికి చక్కటి అవకాశం లభిస్తుంది.


Next Story

Most Viewed