సోమవారం పంచాంగం, రాశి ఫలాలు (19-04-2021)

by  |
Panchangam Rasi phalalu
X

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : సప్తమి సా 6.47
తదుపరి అష్టమి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : పునర్వసు రా 2.06
తదుపరి పుష్యమి
యోగం : సుకర్మ మ 3.58
తదుపరి ధృతి
కరణం : గరజి ఉ 6.20
తదుపరి వణిజ సా 6.47
ఆ తదుపరి భద్ర/విష్ఠి
వర్జ్యం : మ 1.23 – 3.05
దుర్ముహూర్తం : మ 12.23 – 1.13 &
మ 2.53 – 3.42
అమృతకాలం : రా 11.33 – 1.14
రాహుకాలం : ఉ 7.30 – 9.00
యమగండం/కేతుకాలం : ఉ 10.3012.00
సూర్యరాశి : మేషం || చంద్రరాశి : మిథునం
సూర్యోదయం : 5.46 || సూర్యాస్తమయం: 6.12

మేషం : చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి మానసికంగా స్వల్ప చికాకులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ​

వృషభం : సోదరులతోఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు ధనాదాయం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. దూరప్రాంతాల వారి నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు. ​

మిధునం : అవసరానికిచేతిలో డబ్బు నిలవదు.ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో కొన్ని పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్పలాభాలుఅందుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ​

కర్కాటకం : ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుకుంటారు. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. ​

సింహం : వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. ధన పరంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబసభ్యుల తో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ​

కన్య : ఆర్థిక లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం జరిగిన సకాలంలో పూర్తిచేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు ప్రారంభించి లాభాల అందుకుంటారు. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. ​

తుల : వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులువచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలలో ఆశించిన అంచనాలను అందుకుంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ​

వృశ్చికం : పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. దైవ సేవకార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగములు అంతంత మాత్రం గా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి
పనులు సకాలంలో పూర్తి కాకా నిరాశ కలుగుతుంది. ​

ధనస్సు : వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అకారణంగా ఇతరులతో కలహాలు కలుగుతాయి. రావలసిన ధనం చేతికి అందడంలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. విద్యార్థులు మరింత కష్టపడవలసి వస్తుంది. ​

మకరం : జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. రుణాలకు సంబంధించిన వ్యవహారాలు సన్నిహితుల సహాయంఅందుతుంది. వృత్తివ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది. సామజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ​

కుంభం : సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు సద్దుమణుగుతాయి. విద్యార్థులకు పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ​

మీనం : ఇతరులతోజాగ్రత్తగావ్యవహరించాలి. వృత్తిఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. వ్యాపార పరంగా ఒత్తిడి పెరిగిన అధిగమించి లాభాలు అందుకుంటారు. కుటుంబపెద్దల సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.


Next Story

Most Viewed