ఈ రాశివారికి ఈరోజు విజయం నల్లేరు మీద నడక లాంటిది

by  |
Panchangam
X

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అష్టమి (నిన్న రాత్రి 11 గం॥ 27 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 59 ని॥ వరకు)
నక్షత్రం : కృత్తిక (నిన్న తెల్లవారుజాము 3 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 39 ని॥ వరకు)
యోగము : వ్యాఘాతము
కరణం : బాలవ
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 44 ని॥ వరకు)(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 44 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 31 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 1 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 22 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 15 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 1 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 31 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : వృషభము

మేష రాశి : సహనంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కోపము, అసహనము వదిలిపెట్టండి. ఈరోజు డబ్బు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీరు చెప్పదలుచుకున్నది అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి. కొంత మందికి సొంత ఇంటి కల నిజం అవుతుంది. హోటల్ వ్యాపారులకు ఊహిస్తున్న లాభాలు రావు. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి. ఫిట్నెస్ కై ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం పరవాలేదు దుబారా ఖర్చులను నివారించండి. విద్యార్థులు టీవీ మొబైల్ వాడకం వల్ల సమయం వృధా చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

వృషభ రాశి : ఆదాయం బాగుంది పాత బకాయిలను తీర్చి వేస్తారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వారితో గడపటం మీకెంతో ఎనర్జీ. వారి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ వలన తప్పు జరిగింది అనిపిస్తే వారికి క్షమాపణలు చెప్పండి. చెవి నొప్పికి అవకాశం. అందరి వ్యవహారాలలో కి తలదూర్చ వద్దు. కొంత మందికి ఇష్టం ఉండకపోవచ్చు. సంఘంలో పేరుప్రతిష్టలు. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మిథున రాశి : జీవితంలో ఎగుడుదిగుడులు సహజం అని గుర్తించండి. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు దాని వలన మానసిక ప్రశాంతత. మీ పిల్లల చదువుల గురించి వారి ఆరోగ్యం గురించి పట్టించుకోండి. తర్వాత బాధపడి లాభం లేదు. వ్యాపారులకు మీ సరైన కమ్యూనికేషన్ వలన కొత్త అవకాశాలు. దాని వలన లాభాలు. ఉద్యోగస్తులు పూర్తిగా ఆఫీస్ పనుల మీద శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కర్కాటక రాశి : కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు లాభాల కొరకు కొన్ని మార్పులు చేర్పులు చెయ్యండి. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. దాని వలన నష్టమే తప్ప లాభం లేదు. ఆదాయం పర్వాలేదు దుబారా ఖర్చుల వలన డబ్బుకు ఇబ్బంది. మీ తండ్రిగారి ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. మీ పిల్లల చదువుల గురించి వారి ఆరోగ్యం గురించి పట్టించుకోండి తర్వాత బాధపడే లాభం లేదు. మీరు ఇతరులకు చేసిన సహాయం వలన సంఘంలో పేరుప్రతిష్టలు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోండి. నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

సింహరాశి : ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ ప్రగతి మీకే సంతోషాన్ని కలిగిస్తుంది. పై చదువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు మీరు మరింత కష్టపడాలి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదవాలనుకునేవారు. ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి. విదేశీ వ్యాపారం చేసే వారికి లాభాలు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కన్యారాశి : అనాలోచిత నిర్ణయాల వలన నష్టమే తప్ప లాభం లేదు. వ్యాపారులకు ఆదాయ వ్యవహారాలలో ఇబ్బందులు. కొన్ని పనులు అనుకున్నంతగా సాగకపోవచ్చు. ఆఫీసులో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆదాయం పర్వాలేదు అనవసరపు ఖర్చులను చేయకండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి మీ తండ్రిగారి సలహాలు తీసుకోండి దీర్ఘకాలంగా బాధిస్తున్న అనారోగ్యం దూరం అవుతుంది ఆరోగ్యం చక్కబడుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక ఆనందకరమైన రోజు.

తులారాశి : ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ రోజువారీ వ్యవహారాలు పట్ల జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. దైవప్రార్థన వలన మానసిక బలం. మీ దురుసుతనం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆఫీసు పనులను అధిక సామర్థ్యం ఉపయోగించి సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి సమయాన్ని వృధా చేయకండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన ఈరోజు మీ వైవాహిక జీవితం ఒక తీపి గుర్తు.

వృశ్చిక రాశి : ఈరోజు విజయం మీకు నల్లేరు మీద నడక లాంటిది. తోటి ఉద్యోగుల, పై అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోని ప్రయాణాలు దాని వలన లాభాలు. మీడియా వారికి మంచి అవకాశాలు. కావలసిన ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేసి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపడానికి ప్రయత్నించండి.

ధనుస్సు రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆటవిడుపుగా కొంతమంది హాలిడే ట్రిప్ వేస్తారు. అనుకోని అతిథి రాక వలన మీ పనులకు ఇబ్బంది. అన్ని సమస్యలకు మీ చిరునవ్వే సమాధానం. కావలసినంత ధనం చేతికందుతుంది కొంతమంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడతారు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. వారితో కుటుంబ విషయాల గురించి చర్చించండి వారి అభిప్రాయాలను వినండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మకర రాశి : తీర్థయాత్రల వలన ఆధ్యాత్మిక మార్గం వైపు మీ ప్రయాణం మరింత సులభతరం. వంశపారం పర్యంగా రావాల్సిన స్థిరాస్తి మీకు లభిస్తుంది. ఆదాయం బాగుంది మరింత పొదుపు చేస్తారు. ఆఫీసులో మీ సీనియర్ల సలహాతో పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

కుంభరాశి : ఆశావహ దృక్పథంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. తోటి ఉద్యోగులతో హస్క్ కొట్టడం వలన పనులు పూర్తి కావు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి సమయాన్ని వృధా చేయకండి. శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. డబ్బు విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరపు ఖర్చులు నివారించండి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి దానివలన మీకు ఎంతో ఎనర్జీ. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక తీపి గుర్తు.

మీన రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలను బహిరంగంగా తీసుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ బడ్జెట్ పరిమితిని దాటి ఖర్చు పెట్టకండి. దీర్ఘకాలంగా బాధిస్తున్న అనారోగ్యం మాయమవుతుంది. ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. వారితో గడపడం మీకు ఎంతో ఎనర్జీ. రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

Next Story

Most Viewed