ఈ రాశివారికి కోర్టు కేసు అనుకూలం

by  |
ఈ రాశివారికి కోర్టు కేసు అనుకూలం
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ (నిన్న ఉదయం 7 గం॥ 47 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 18 ని॥ వరకు)
నక్షత్రం : ఆశ్లేష (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 22 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 13 ని॥ వరకు)
యోగము : వజ్రము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 37 ని॥ నుంచి 5 గం॥ 16 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ఈరోజు అమృతఘడియలు లేవు.
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 47 ని॥ నుంచి 1 గం॥ 39 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 24 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 16 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 26 ని॥ నుంచి 9 గం॥ 4 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి 3 గం॥ 37 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 42 ని॥ నుంచి మధ్యాహ్నం 12 గం॥ 20 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 48 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : కర్కాటకము

మేష రాశి : సహనం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త. కొంతమందికి ఉద్యోగ మార్పు తోటి ఉద్యోగులతో, పై అధికారులతో వాదోప వాదాలకు దిగకండి. పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి జాగ్రత్త వహించండి. అందరిని గుడ్డిగా నమ్మకండి. ప్రేమికుల ప్రేమ విఫలం. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలు మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

వృషభ రాశి : ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి జాగ్రత్త వహించండి. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కాఫీ మానేయండి. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. పనులను సకాలంలో పూర్తి చేయండి. తోడబుట్టిన వారి సహాయం లభిస్తుంది. స్నేహితులకు డబ్బు సర్దుబాటు చేస్తారు. వారితో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీరు చెప్పిన విషయాలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వటం లేదని మానసిక అశాంతి. వాటిని మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

మిధున రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే పట్టుదల, సరైన ప్రణాళిక తప్పనిసరి. ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఈరోజు మీ శక్తి సామర్థ్యాలను వెలికి తీయండి. ఆదాయం బాగున్నా అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఇంటిలో చిన్న పిల్లల అనారోగ్యం వలన మానసిక అశాంతి. నూతన పెట్టుబడులపై భాగస్వాములతో చర్చించండి వారిని ఒప్పించండి ఆఫీసు పనులను అధిక శ్రమతో పూర్తి చేసినప్పటికీ మీకు రావలసిన గుర్తింపు రాదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యచతుర సంభాషణ వలన మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక తీపి గుర్తు.

కర్కాటక రాశి : ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు. గందరగోళం వదిలేయండి. భగవంతుడు ఇచ్చిన విలువైన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోండి. జీతాలు ఇంకా అందకపోవడం వలన చిన్నచిన్న అప్పులు చేయవలసి రావచ్చు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. పరిస్థితులకు తగినట్టు ప్రవర్తించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

సింహరాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే, నిజాయితీ, సరైన ప్రణాళిక వెయ్యండి. మీరు అనుకున్న ఫలితాలు రాలేదని నిరుత్సాహం చెందకండి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి లేకుంటే ఆరోగ్యం పాడవుతుంది. గందరగోళం వదిలేయండి ప్రశాంతంగా ఆలోచించండి. ఆఫీస్ పనులను పూర్తి చేయాలంటే అధిక శ్రమ అవసరం. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పోవాలంటే వారితో మనసు విప్పి మాట్లాడండి. అధిక శ్రమ వలన కాళ్ల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కన్య రాశి : అదృష్టం కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను పెద్ద వారి సలహాతో తీసుకోండి. తోడబుట్టిన వారి విజయాల వలన మీకు ఎంతో ఆనందం ఈరోజు పనులలో అధికశ్రమ ఉన్నప్పటికీ ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆఫీసు పనుల్లో టెన్షన్ ను అదుపులో ఉంచుకోండి. ఆదాయం బాగున్నప్పటికీ అనుకోని ఖర్చులు వలన డబ్బుకు ఇబ్బంది. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు

తులారాశి : ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. అన్నదమ్ములు అప్పు అడగవచ్చు. దానివలన మీ ఆదాయ వ్యవహారాలు మరింత ఇబ్బంది పెడతాయి ఆఫీసు పనులలో అధిక శ్రమ. నిర్లక్ష్యం వహించకండి పట్టుదలతో పనులు పూర్తి చేయండి. కొంతమందికి ఆఫీస్ టూర్స్. కొంతమందికి జీతాలు పెరుగుతాయి. ఆరోగ్య రీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

వృశ్చిక రాశి : దైవ ప్రార్ధన వలన మానసిక బలం. అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక వేయండి. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొరకు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది అయినా డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయడానికి సరైన ప్రణాళిక వేయండి. నూతన భాగస్వామ్య వ్యాపారాలు పై ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

ధనుస్సు రాశి : ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసులో పని ఎక్కువగా ఉంది. ఒత్తిడిని అధిగమించి సహనంతో పని చెయ్యండి. పై అధికారుల మెప్పు లేకపోవడంతో మానసిక అశాంతి. తల్లిగారి వైపునుంచి ధన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా షాపింగ్ చేస్తారు. సీజనల్ మార్పుల వలన దగ్గు జలుబు ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

మకర రాశి : వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. దానధర్మాలు చేయడం వలన దైవ బలం. ఊహించని విధంగా లాభాలను చూస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం. దానివలన అందరి ప్రశంసలు. మానసిక శారీరక ఆరోగ్యం కొరకు యోగా మెడిటేషన్ చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఇది ఒక తీపి గుర్తు.

కుంభరాశి : మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అందరి సహకారం వలన ఆహ్లాదకర వాతావరణం. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఇంతకుముందు తీసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వని బంధువులకు అప్పులు ఇవ్వకండి. అందర్నీ గుడ్డిగా నమ్మకండి. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. సరైన పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ వ్యక్తిత్వం వలన మీ వైవాహిక బంధం మరింత గట్టిపడుతుంది.

మీన రాశి : స్థిరాస్తి వ్యవహారాలలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు మీకు అనుకూలం. కోపాన్ని, పరుషంగా మాట్లాడడాన్ని వదిలివేయండి కుటుంబ సభ్యులతో సామరస్యంగా ప్రవర్తించండి దానివలన ఇంటి లో ఆహ్లాదకర వాతావరణం. మీ భార్య ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులు మరింత లాభాల కోసం నూతన మార్గాలను అన్వేషిస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలు మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.


Next Story

Most Viewed