- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లా కెప్టెన్‌కు కరోనా..
by B.Srinivas |
<p>దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ మోమినుల్ హక్ కరోనా బారిన పడ్డాడు. గత రెండ్రోజులుగా స్వల్ప కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న అతను పరీక్షలు చేయించుకోగా, మంగళవారం వెలువడిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వైద్యుడు దేబాశిశ్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం మోమినుల్ అతని ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉన్నాడని.. 14 రోజుల తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాగా, నవంబర్ మూడో […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ మోమినుల్ హక్ కరోనా బారిన పడ్డాడు. గత రెండ్రోజులుగా స్వల్ప కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న అతను పరీక్షలు చేయించుకోగా, మంగళవారం వెలువడిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వైద్యుడు దేబాశిశ్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం మోమినుల్ అతని ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉన్నాడని.. 14 రోజుల తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాగా, నవంబర్ మూడో వారం నుంచి మొదలయ్యే బంగ బంధు టీ20 టోర్నీలో మోమినుల్ పాల్గొనడంపై సందిగ్దత నెలకొన్నది.
Next Story






